Breaking News

బంగ్లాదేశ్‌ ఖేల్‌ ఖతం!

Published on Sun, 01/25/2026 - 03:43

దుబాయ్‌: టి20 వరల్డ్‌ కప్‌లో భాగంగా తమ మ్యాచ్‌లను భారత్‌లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చర్య తీసుకుంది. బంగ్లా టీమ్‌ను వరల్డ్‌ కప్‌నుంచి తప్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. జట్టు ఆటగాళ్లు, ఇతర సిబ్బంది భద్రతకు హామీ ఇస్తూ ఎన్నో విధాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) తమ మంకు పట్టు వీడలేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీమ్‌పై ఐసీసీ వేటు వేసింది. 

ఐసీసీ ర్యాంకింగ్స్‌ ప్రకారం తర్వాతి స్థానంలో ఉన్న స్కాట్లాండ్‌ ఈ టోర్నమెంట్‌లో బంగ్లా స్థానంలో బరిలోకి దిగుతుంది. బంగ్లాను తప్పించాలనే ప్రతిపాదనపై ఐసీసీ బోర్డు సమావేశంలో 14 దేశాల ప్రతినిధులు అనుకూలంగా ఓటు వేయగా...కేవలం పాకిస్తాన్‌ మాత్రం ఆ జట్టుకు మద్దతు పలికింది. దాంతో వేటు లాంఛనంగానే మారింది. 

టీమ్‌ను వరల్డ్‌ కప్‌ను తొలగిస్తూ తాము తీసుకున్న నిర్ణయాన్ని ఐసీసీ శుక్రవారం బీసీబీకి  తెలియజేసింది. ఐసీసీలోని ఇతర సభ్య దేశాలకు కూడా ఈ సమాచారం అందించింది. టోర్నీకి దూరం కావడం బంగ్లా బోర్డుపై ఆరి్థ కపరంగా కూడా తీవ్ర ప్రభావం చూపించనుంది. వరల్డ్‌ కప్‌లో పాల్గొనేందుకు ఇచ్చే 5 లక్షల డాలర్లతో పాటు ఐసీసీనుంచి ప్రతీ ఏటా అందే 27 మిలియన్‌ డాలర్లు కోల్పోనుంది.  

బంగ్లా నిష్క్రమణ నేపథ్యమిదీ... 
తాజా పరిణామాలను బట్టి చూస్తే వరల్డ్‌ కప్‌కు దూరం కావడం బంగ్లా స్వయంకృతమే. ఐపీఎల్‌ వేలంలో బంగ్లా పేసర్‌ ముస్తఫిజుర్‌ రహమాన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ. 9.50 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి ఆటగాడిని ఐపీఎల్‌లో ఆడించాలనే ఆలోచనపై భారత్‌లో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. 

వీటికి స్పందిస్తూ  కేకేఆర్‌ యాజమాన్యం ముస్తఫిజుర్‌ను లీగ్‌ నుంచి తప్పించింది. తమ ఆటగాడిని అర్ధాంతరంగా తొలగించడం బీసీబీకి నచ్చలేదు. దీనిని ఆ దేశ బోర్డు ఒక రకమైన అవమానంగా భావించింది. దాంతో భారత్‌లో తమ ఆటగాళ్లకు భద్రత లేదంటూ కొత్త విషయాన్ని ముందుకు తెచ్చింది. టి20 వరల్డ్‌ కప్‌లో తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలంటూ డిమాండ్‌ చేస్తూ వచ్చింది. 

ఈ అంశంపై స్పందించిన ఐసీసీ బంగ్లాకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. టోర్నీకి చాలా తక్కువ సమయం ఉండటంతో ఇప్పుడు షెడ్యూల్‌ మార్పు సాధ్యం కాదని స్పష్టం చేసింది. భారత్‌లో ఆ దేశపు ఆటగాళ్లు, మీడియా, ఇతర సిబ్బందికి ఎలాంటి సమస్య రాకుండా అన్ని రకాలుగా భద్రతాపరమైన ఏర్పాట్లు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే బీసీబీ మాత్రం వెనక్కి తగ్గలేదు. 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు