Breaking News

'డబ్ల్యూటీసీ ఫైనల్స్.. మా అంచనాలను అందుకున్నాయి'

Published on Fri, 12/12/2025 - 09:24

దుబాయ్‌: వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్‌ టెస్టు క్రికెట్‌లో అన్నింటికంటే అత్యుత్తమ స్థాయిలో ఉండాలని తాము ఆశించామని... మూడు ఫైనల్‌ మ్యాచ్‌లు కూడా తమ అంచనాలను అందుకున్నాయని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) సీఈఓ సంజోగ్‌ గుప్తా అభిప్రాయ పడ్డారు. 

2025లో జరిగిన ఫైనల్స్‌ కోసం లార్డ్స్‌ స్టేడియం పూర్తిగా నిండిపోవడం ఐసీసీ చరిత్రలో నిలిచిపోయే క్షణమని ఆయన అన్నారు. ఇప్పటి వరకు మూడు డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ జరగ్గా... వరుసగా న్యూజిలాండ్, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా విజేతలుగా నిలిచాయి.

"డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ అంటే మిగతా టెస్టుల తరహాలో కాదు. ఈ ఫార్మాట్‌లో రెండేళ్ల శ్రమ తర్వాత రెండు అత్యుత్తమ జట్లు తలపడే సందర్భం. టెస్టు క్రికెట్‌ విలువ ఏమిటో ఈ మ్యాచ్‌లు చూపించాయి. డబ్ల్యూటీసీ మొదలు పెట్టినప్పుడు మేం ఆశించిన స్పందన ఇక్కడ వచ్చింది. మా అంచనాలు ఫైనల్స్‌ అందుకున్నాయి.  లార్డ్స్‌లో జరిగిన ఫైనల్లో భారత్‌ గానీ ఇంగ్లండ్‌ గానీ ఆడలేదు. 

అయినా సరే స్టేడియం నిండిపోయింది. ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్‌పై అభిమానులు ఎంత ఆసక్తిని ప్రదర్శించారో ఇది చూపించింది. అన్నింటికి మించి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు మరో ఆరు నెలల సమయం ఉన్నా కూడా ఎవరు ఫైనల్‌ చేరతారనే చర్చ అన్ని జట్లలో కనిపిస్తోంది. దీనికి అర్హత సాధించే క్రమంలో ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌ల ప్రాధాన్యం ఎంతో పెరిగింది" అని సంజోగ్‌ వ్యాఖ్యానించారు.
చదవండి: నేను.. అత‌డే ఈ ఓట‌మికి కార‌ణం! ప్ర‌తీసారి కూడా: సూర్యకుమార్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)