Breaking News

ఛాంపియ‌న్స్ ట్రోఫీపై నీలినీడలు.. ఐసీసీ రద్దు చేయనుందా!?

Published on Sun, 11/10/2024 - 13:23

వ‌చ్చే ఏడాది పాకిస్తాన్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీపై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. ఈ మెగా టోర్నీని రద్దు చేసే ఆలోచ‌న‌లో అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ విష‌యంపై ఐసీసీ మాత్రం ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

కాగా ఇప్పటికే  మెగా టోర్నీలో పాల్గోనేందుకు భార‌త జట్టును పంపేది లేద‌ని బీసీసీఐ ఇప్ప‌టికే స్పష్టం చేసింది.  భారత్ ఆడే మ్యాచ్‌లను హైబ్రిడ్‌ మోడల్‌తో నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తుండగా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం తమ దేశానికి రావాల్సిందేనని మొండి పట్టుపడుతోంది.

దీంతో భారత్ ఆడే మ్యాచ్‌లను షెడ్యూల్ చేయడం ఐసీసీకి క్లిష్టంగా మారింది. ఈ క్రమంలోనే ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి నవంబర్ 11న ల‌హోర్‌లో జరగాల్సిన ఓ మేజర్ ఈవెంట్‌ను ఐసీసీ రద్దు చేసింది. ఈ ఈవెంట్‌లో టోర్నీలో పాల్గోనే జట్ల జాతీయ జెండాలతో పాటు షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేయాలని భావించింది. కానీ రద్దు చేయ

కాగా  ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించి వంద రోజుల కౌంట్‌డౌన్‌ కూడా ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఐసీసీ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఎటువంటి ప్ర‌క‌ట‌న రాలేదు. ఇవ‌న్నీ చూస్తుంటే ఛాంపియ‌న్స్ ట్రోఫీ నిర్వ‌హ‌ణ‌పై ఐసీసీ డైల‌మాలో ప‌డిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా ఇదే విష‌యంపై ఐసీసీ అధికారి ఒక‌రూ మాట్లాడుతూ.. ఛాంపియ‌న్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇంకా ఖారారు కాలేదు.

"ఈ టోర్నీలో పాల్గోనే జ‌ట్లతో పాటు ఆతిథ్య‌మిస్తున్న పాకిస్తాన్‌తో కూడా చర్చలు జరుపుతున్నాము. షెడ్యూల్ ఖారారైన త‌ర్వాత అధికారికంగా ప్ర‌క‌టిస్తాము. ట్రోఫీ టూర్ ఫ్లాగ్, ట్రోఫీని లాంఛ్ చేసేందుకు లహోర్‌లో ఓ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని భావించాము. కానీ అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ కార్య‌క్ర‌మాన్ని ర‌ద్దు చేయాల్సి వ‌చ్చింది అని ఆయ‌న పేర్కొన్నారు.
చదవండి: PAK vs AUS: నిప్పులు చెరిగిన పాక్ బౌల‌ర్లు.. 140 ప‌రుగుల‌కే ఆసీస్ ఆలౌట్‌
 

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు