Breaking News

ఐసీసీ కీలక నిర్ణయం

Published on Sat, 11/08/2025 - 08:53

దుబాయ్‌: మహిళా క్రికెట్‌ విషయంలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి మహిళల వన్డే వరల్డ్‌ కప్‌లో జట్ల సంఖ్యను ఎనిమిది నుంచి పదికి పెంచాలని  నిర్ణయించింది. దుబాయ్‌లో జరుగుతున్న ఐసీసీ సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు  బోర్డు తీసుకుంది.

ఇకపై ఐసీసీలోని అసోసియేట్‌ దేశాలకు ఇచ్చే నిధులను 10 శాతం పెంచనున్నారు. అమెరికా క్రికెట్‌ బోర్డుపై నిషేధం ఉన్నా... దాని ప్రభావం ఆటగాళ్లపై పడరాదని భావిస్తూ మ్యాచ్‌ల నిర్వహణకు తగిన చర్యలు తీసుకునేందుకు కూడా ఐసీసీ సిద్ధమైంది. క్రికెట్‌ భాగంగా ఉన్న 2028 ఒలింపిక్స్‌ అమెరికాలో జరగనుండటం కూడా దీనికి కారణం.

మరోవైపు.. ఐసీసీ మహిళల క్రికెట్‌ కమిటీలో భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌(Mithali Raj)కు చోటు కల్పించారు. యాష్లీ డిసిల్వా, అమోల్‌ మజుందార్, చార్లెట్‌ ఎడ్వర్డ్స్, స్టెల్లా సియాలె ఈ కమిటీలో ఇతర సభ్యులుగా ఉన్నారు.  

రికార్డు రేటింగ్స్‌... 
ముంబై: మహిళల వన్డే వరల్డ్‌ కప్‌ టోర్నీ వీక్షణపరంగా డిజిటల్‌ వేదికపై సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా 446 మిలియన్ల మంది వీక్షకులు ఈ టోర్నీని జియో హాట్‌స్టార్‌లో చూసినట్లు ప్రసారకర్తలు వెల్లడించారు. ఇది మహిళల క్రికెట్‌లో అత్యధికమని పేర్కొంది.

మరోవైపు భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఫైనల్‌ (IND vs SA) మ్యాచ్‌ కూడా కొత్త రికార్డు నమోదు చేసింది. ఫైనల్‌ను 185 మిలియన్ల మంది డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌పై వీక్షించారని... 2024 టీ20 పురుషుల వరల్డ్‌ కప్‌లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఫైనల్‌తో ఇది సమానమని నిర్వాహకులు ప్రకటించడం విశేషం. 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)