నేనేమీ లక్కీ చార్మ్‌ కాదు.. కానీ నేనొచ్చాకే ఆర్సీబీకి ట్రోఫీలు!

Published on Tue, 06/02/2026 - 11:07

పద్దెమినిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. గతేడాది తొలిసారి ఐపీఎల్‌ ట్రోఫీని ముద్దాడింది రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ). డిఫెండింగ్‌ చాంపియన్‌గా భారీ అంచనాలతో ఐపీఎల్‌-2026లో బరిలోకి దిగి.. మరోసారి టైటిల్‌ సాధించి సత్తా చాటింది.

అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి ఆర్సీబీ జయకేతనం ఎగురవేసింది. తద్వారా రజత్‌ పాటిదార్‌ సారథ్యంలో వరుసగా రెండోసారి టైటిల్‌ గెలిచి.. అభిమానులను సగర్వంగా తలెత్తుకునేలా చేసింది.

ఈ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్‌ దిగ్గజం పూసర్ల వెంకట సింధు (PV Sindhu) ఆర్సీబీకి శుభాకాంక్షలు చెప్పిన తీరు వైరల్‌గా మారింది. తాను బెంగళూరుకు మకాం మార్చిన తర్వాత.. అకస్మాత్తుగా ఆర్సీబీ ట్రోఫీల మీద ట్రోఫీలు గెలుస్తోందని సరదాగా ఆమె కామెంట్‌ చేశారు.

నేనొచ్చాకే ఆర్సీబీకి ట్రోఫీలు!
‘‘ఆర్సీబీ అభిమానులారా!... నేనేమీ మీ లక్కీ చార్మ్‌ అని చెప్పడం లేదు. కానీ.. మీరొకటి గమనించారా.. నేను బెంగళూరుకు మకాం మార్చినప్పటి నుంచి అకస్మాత్తుగా మీరు వరుసగా ట్రోఫీలు సాధిస్తున్నారు. అవునో.. కాదో మీరే లెక్కలు కట్టేయండి.

ఏదేమైనా ఆర్సీబీ ఒక అసామాన్యమైన జట్టు. ఆటగాళ్లు, సహాయ సిబ్బంది.. అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా జట్టును తమ సొంతంగా భావించే అభిమానులకు కంగ్రాట్స్‌. ఈ ఫ్రాంఛైజీ భావోద్వేగాలకు నిలయం.

అత్యంత ప్రత్యేకం
ఆర్సీబీ అంటే ఫ్యాన్స్‌కు ఒక రకంగా పిచ్చి. ఎన్నో ఏళ్లుగా ట్రోఫీ గెలుస్తామనే నమ్మకంతో వారు జట్టుకు అండగా నిలిచారు. ఇప్పుడిలా వరుసగా రెండుసార్లు చాంపియన్‌గా నిలవడం నిజంగా అత్యంత ప్రత్యేకం’’ అని పీవీ సింధు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆర్సీబీకి శుభాకాంక్షలు తెలిపారు.

అయితే, ఫైనల్లో చాలా మంది మాదిరే తానూ ఆర్సీబీ వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ పోరును చూడాలనుకున్నానన్న సింధు.. బెంగళూరు ఈ విజయానికి వందశాతం అర్హమైందని పేర్కొన్నారు. 

కాగా ఐపీఎల్‌లో వరుసగా రెండుసార్లు టైటిల్‌ సాధించిన కెప్టెన్‌గా మహేంద్ర సింగ్‌ ధోని (చెన్నై సూపర్‌ కింగ్స్‌), రోహిత్‌ శర్మ (ముంబై ఇండియన్స్‌) సరసన రజత్‌ పాటిదార్‌ నిలిచాడు. ఈ నేపథ్యంలో అతడిపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

చదవండి: అతడేమీ రోబో కాదు.. బీసీసీఐ తప్పు చేస్తోందా?

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)