Breaking News

తప్పుడు వ్యక్తులతో స్నేహం.. అప్పుడు అతడు తప్ప ఎవరూ మాట్లాడలేదు: పృథ్వీ షా

Published on Thu, 06/26/2025 - 09:45

భారత క్రికెటర్‌ పృథ్వీ షా (Prithvi Shaw) గత రెండేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఒకప్పుడు.. ఆటలో సచిన్‌ టెండుల్కర్‌ వారసుడిగా పేరొందిన ఈ ముంబైకర్‌ ఇప్పుడు అవకాశాల కోసం పాకులాడాల్సిన పరిస్థితి. క్రమశిక్షణా రాహిత్యం, ఫిట్‌నెస్‌ లేమి కారణంగా కెరీర్‌ పరంగా ఎంతో వెనుకబడిపోయాడు పృథ్వీ.

గిల్‌ ఏకంగా టీమిండియా సారథి అయితే..
అండర్‌-19 జట్టు కెప్టెన్‌గా భారత్‌కు ప్రపంచకప్‌ అందించిన పృథ్వీ షా సారథ్యంలో ఆడిన శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) ఏకంగా టీమిండియా కెప్టెన్‌ అయితే.. ఇతడు మాత్రం దేశవాళీ జట్టులోనూ చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఇక ఐపీఎల్‌-2025 మెగా వేలంలో ఒక్క ఫ్రాంఛైజీ కూడా కనీస ధర రూ. 75 లక్షల ధరకు పృథ్వీని కొనుగోలు చేయకపోవడం అతడి పరిస్థితికి అద్దం పడుతోంది.

ఈ నేపథ్యంలో పృథ్వీ షా ఇటీవలే ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశీ క్రికెట్‌లో ముంబై జట్టును వీడాలని నిర్ణయించుకోగా.. ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ ఇందుకు అంగీకరించింది. ఇక వచ్చే సీజన్‌లో కొత్త ప్రయాణం మొదలుపెట్టనున్న పృథ్వీ షా తాజాగా న్యూస్‌24కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలు పంచుకున్నాడు.

పంత్‌ తప్ప ఎవరూ మాట్లాడలేదు.. సచిన్‌ సర్‌కు తెలుసు
తాను కెరీర్‌ పరంగా ఇబ్బందుల్లో ఉన్నపుడు ఒక్క ‘బిగ్‌ క్రికెటర్‌’ కూడా తనకు అండగా నిలవలేదని పృథ్వీ చెప్పాడు. టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) తప్ప ఎవరూ తనతో కనీసం మాట్లాడలేదని తెలిపాడు. ‘‘సచిన్‌ టెండుల్కర్‌కు నాకు సమస్యలు తెలుసు.

అర్జున్‌ టెండుల్కర్‌తో పాటు నేను క్రికెటర్‌గా ఎదగడం ఆయన చూశారు. ఓసారి వారి ఇంటికి కూడా వెళ్లాను. అయితే, నేను కెరీర్‌ పరంగా చిక్కుల్లో ఉన్నపుడు రిషభ్‌ పంత్‌ తప్ప ఒక్కరూ పలకరించలేదు’’ అని పృథ్వీ షా వెల్లడించాడు.

అదే విధంగా ఆటపై దృష్టి పెట్టలేకపోవడానికి గల కారణాల్ని వివరిస్తూ.. ‘‘నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు మాత్రమే తెలుసు. బయటి నుంచి చూసే వాళ్లకు ఇది అర్థం కాకపోవచ్చు. జీవితంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా.

తప్పుడు వ్యక్తులతో స్నేహం
అందుకే ఆటకు ఎక్కువ సమయం కేటాయించలేకపోయా. నిజానికి నేను గంటల కొద్దీ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేసేవాడిని. కనీసం మూడు నాలుగు గంటలు నెట్స్‌లో గడిపేవాడిని. రోజులో సగం సమయం అక్కడే గడిపేవాడిని. కానీ ఆ తర్వాత ఆట నుంచి నా దృష్టి మరలింది.

తర్వాత నాలో పశ్చాత్తాపం మొదలైంది. దేనికి ఎంత సమయం కేటాయించాలో ఓ అవగాహన వచ్చింది. తప్పుడు వ్యక్తులతో స్నేహం చేశాను. క్రికెటర్‌గా నేను ఉన్నత స్థితిలో ఉన్నపుడు వాళ్లు నా చెంత చేరారు. నన్ను చాలా చోట్లకు తిప్పారు.

అప్పుడే నేను దారి తప్పాను. ఒకప్పుడు నెట్స్‌లో 8 గంటలకు పైగా ప్రాక్టీస్‌ చేసేవాడిని. ఇప్పుడు ఆ సమయం నాలుగు గంటలకు తగ్గింది’’ అని పృథ్వీ షా తన తప్పులను అంగీకరించాడు. ఇకపై ఆటపైనే దృష్టి కేంద్రీకరిస్తానని వెల్లడించాడు. కాగా వచ్చే డొమెస్టిక్‌ సీజన్‌లో పృథ్వీ మహారాష్ట్ర జట్టుకు ఆడే అవకాశం ఉంది.

చదవండి: క్రికెట్‌ టీమ్‌ను కొనుగోలు చేసిన సల్మాన్‌ ఖాన్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)