Breaking News

దక్షిణాఫ్రికాతో సవాల్‌కు సిద్ధంగా ఉన్నాను: సిరాజ్‌

Published on Wed, 11/12/2025 - 04:00

ఇంగ్లండ్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ను ‘డ్రా’ చేయడంలో కీలకపాత్ర పోషించిన భారత పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ ఇప్పుడు స్వదేశంలో మరో పటిష్ట జట్టుపై చెలరేగాలని పట్టుదలగా ఉన్నాడు. శుక్రవారం నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌లో మన టీమ్‌ పైచేయి సాధిస్తుందని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘వరల్ట్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్లపరంగా మనకు ఇది చాలా కీలక సిరీస్‌.

పైగా దక్షిణాఫ్రికా చాంపియన్‌ కూడా. ఆ జట్టు ఇటీవల పాక్‌పై సిరీస్‌ 1–1తో ‘డ్రా’ చేసుకున్నది వాస్తవమే. అయితే మా జట్టు కూడా చాలా బలంగా ఉంది. ఇంగ్లండ్‌తో చాలా బాగా ఆడి ఇటీవల వెస్టిండీస్‌పై అలవోకగా గెలిచాం. ఈ ఫామ్‌ కారణంగా టీమ్‌లో ఆత్మవిశ్వాసం పెరిగి అంతా సానుకూల వాతావరణం ఉంది. వ్యక్తిగతంగా నా బౌలింగ్‌ మంచి లయతో సాగుతోంది. 

కాబట్టి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలనని నమ్ముతున్నా. పెద్ద జట్లను ఎదుర్కొనేటప్పుడు మన లోపాలు ఏమిటో తెలిసి వాటిని సరిదిద్దుకునే అవకాశం కలుగుతుంది. దక్షిణాఫ్రికాతో తలపడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’ అని సిరాజ్‌ చెప్పాడు. భారత్‌ తరఫున 43 టెస్టులు ఆడిన సిరాజ్‌ 133 వికెట్లు పడగొట్టాడు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)