Breaking News

ఐపీఎల్‌ చరిత్రలో బెస్ట్‌ ఫినిషర్‌.. సంజూ కూడా సూపర్‌: వార్నర్‌

Published on Fri, 10/17/2025 - 17:36

టీమిండియా స్టార్లు సంజూ శాంసన్‌ (Sanju Samson), రింకూ సింగ్‌ (Rinku Singh)లపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ ప్రశంసలు కురిపించాడు. జట్టులో తమ స్థానాలను సుస్థిరం చేసుకునేందుకు వీరిద్దరు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. తోటి ఆటగాళ్ల నుంచి పోటీని తట్టుకుని అద్భుత ప్రదర్శనలతో రాణించారంటూ కొనియాడాడు.

మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. తొలుత వన్డే సిరీస్‌ జరుగనుండగా.. అనంతరం ఇరుజట్లు టీ20 సిరీస్‌లో పాల్గొంటాయి. ఇక ఈసారి కూడా సంజూ శాంసన్‌కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. వికెట్‌ కీపర్‌ కోటాలో కేఎల్‌ రాహుల్‌తో కలిసి.. ధ్రువ్‌ జురెల్‌ (Dhruv Jurel) వన్డే టీమ్‌లోకి వచ్చాడు.

సెలక్టర్ల తీరుపై విమర్శలు
సంజూను కాదని మరీ జురెల్‌ను ఎంపిక చేయడం పట్ల టీమిండియా సెలక్టర్ల తీరుపై విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. టీ20 జట్టులో మాత్రం సంజూకు చోటు దక్కింది. ఇక రింకూ సింగ్‌ కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

ఐపీఎల్‌ చరిత్రలో బెస్ట్‌ ఫినిషర్‌
ఈ నేపథ్యంలో ఫాక్స్‌ క్రికెట్‌తో మాట్లాడుతూ డేవిడ్‌ వార్నర్‌.. సంజూ, రింకూలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీమిండియా టీ20 జట్టులో తమ స్థానం పదిలం చేసుకునేందుకు వాళ్లిద్దరు ఎంతగానో కష్టపడ్డారు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. ముఖ్యంగా రింకూ ఐపీఎల్‌ చరిత్రలోనే ప్రస్తుతం  అత్యుత్తమ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు.

ఇప్పటికే భారత జట్టులో ఎంతో మంది వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్లు ఉన్నారు. వారితో పాటు ఇప్పుడు ఫియర్‌లెస్‌ యంగ్‌స్టర్లు కూడా వచ్చేశారు. భారత క్రికెట్‌కు ఇది శుభ పరిణామం. ఆస్ట్రేలియాకు ఈ యువ ఆటగాళ్ల రూపంలో కఠిన సవాలు ఎదురుకానుంది.

మా వాళ్లకు అగ్ని పరీక్ష
ఆస్ట్రేలియన్లకు ఈ సిరీస్‌ అగ్ని పరీక్ష వంటిది. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో తొంభై వేల ప్రేక్షకుల సమక్షంలో మ్యాచ్‌ ఎలా ఉండబోతుందో చూసేందుకు నేను ఆసక్తిగా ఉన్నాను’’ అని వార్నర్‌ పేర్కొన్నాడు. కాగా అక్టోబరు 19- నవంబరు 8 వరకు భారత్‌- ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. కాగా టీమిండియా ఇటీవలే ఆసియా టీ20 కప్‌-2025 గెలిచి జోరు మీదుంది.

చదవండి: IND vs AUS: ఈసారైనా కంగారులను కంగారు పెట్టిస్తారా?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)