Breaking News

అతడు ఎక్కడో తప్పిపోయాడు.. వీళ్లు అద్భుతం: సూర్యకుమార్‌

Published on Sat, 12/20/2025 - 10:49

సౌతాఫ్రికాతో ఐదో టీ20లో గెలిచిన టీమిండియా ఈ ఏడాదిని విజయంతో ముగించింది. స్వదేశంలో సత్తా చాటి ప్రొటిస్‌ జట్టును 3-1తో ఓడించి సిరీస్‌ కైవసం చేసుకుంది. ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ ఆసాంతం బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రయోగాలతో విమర్శలు మూటగట్టుకున్న టీమిండియా విజయంతోనే సమాధానమిచ్చింది.

అయితే, ఈ సిరీస్‌ మొత్తంలో బ్యాటర్‌గా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) విఫలమయ్యాడు. టీ20 సారథిగా పూర్తిస్థాయిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత గత 14 నెలలుగా అతడి ఫామ్‌ ఆందోళనకరంగా మారింది. సౌతాఫ్రికాతో తాజా సిరీస్‌లో మొత్తం కలిపి కేవలం 34 పరుగులు (నాలుగు ఇన్నింగ్స్‌) మాత్రమే చేయడం గమనార్హం.

దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నాం
సౌతాఫ్రికాతో ఐదో టీ20లో విజయానంతరం సూర్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ తన ఫామ్‌పై స్పందించాడు. ‘‘ఈ సిరీస్‌లో ఎలా ఆడాలని అనుకున్నామో.. ఆది నుంచి అదే విధంగా ఆడి ఫలితాన్ని రాబట్టాము. మేమేమీ కొత్తగా ట్రై చేయలేదు. ప్రతి విభాగంలోనూ పటిష్టం కావాలని భావించాము. అందుకు తగ్గ ఫలితం మీ కళ్ల ముందే ఉంది.

దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నాం. ఈరోజు అది అద్భుతమైన ఫలితం ఇచ్చింది. బుమ్రా (Jasprit Bumrah)తో పవర్‌ ప్లేలో ఒక్క ఓవర్‌ మాత్రమే వేయించి.. డెత్‌ ఓవర్లలోనూ వాడాలని అనుకున్నాము. ఈ సిరీస్‌లో మేము ప్రయత్నించాలనుకున్న ప్రతి ఒక్కటి ప్రయత్నించి చూశాము.

అతడు ఎక్కడో తప్పిపోయాడు
అయితే, ‘సూర్య ది బ్యాటర్‌’ని మాత్రం మేము మిస్సయ్యాము. అతడు ఎక్కడో తప్పిపోయాడు. త్వరలోనే స్ట్రాంగ్‌ కమ్‌బ్యాక్‌ ఇస్తాడు’’ అని సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాటర్‌గా తన వైఫల్యాన్ని అంగీకరించాడు. 

ఏదేమైనా జట్టు ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నానని.. కష్టాల్లో ఉన్న ఎవరో ఒక ఆటగాడు ముందుకు వచ్చి బాధ్యత తీసుకోవడం గొప్ప విషయమని సహచర ఆటగాళ్లను ప్రశంసించాడు. కాగా ఐదో టీ20లో సూర్య ఐదు పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు.

టెస్టులలో వైట్‌వాష్‌.. వైట్‌బాల్‌ సిరీస్‌లు కైవసం
కాగా స్వదేశంలో సౌతాఫ్రికా చేతిలో టెస్టుల్లో 2-0తో వైట్‌వాష్‌కు గురైన టీమిండియా.. వన్డే సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. తాజాగా అహ్మదాబాద్‌లో శుక్రవారం నాటి ఐదో టీ20లో గెలిచి 3-1తో సిరీస్‌ కైవసం చేసుకుంది. తదుపరి న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ అనంతరం.. భారత టీ20 జట్టు సొంతగడ్డపై జరిగే ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ బరిలో దిగనుంది. 

చదవండి: రోహిత్‌ శర్మ యూటర్న్‌!

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)