Breaking News

వారెవ్వా హ‌ర్షిత్‌.. దెబ్బకు ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది! వీడియో

Published on Wed, 01/14/2026 - 20:19

టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా మరోసారి బంతితో అద్భుతం చేశాడు. న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న  రెండో వన్డేలో స్టార్ బ్యాటర్‌ డెవాన్ కాన్వేను సంచలన బంతితో రాణా క్లీన్ బౌల్డ్ చేశాడు. 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌కు ఓపెనర్లు కాన్వే, హెన్రీ నికోల్స్ ఘనమైన ఆరంభాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించారు.

కానీ భారత పేసర్లు రాణా, సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ఓపెనర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఈ క్రమంలో కివీస్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో రాణా వేసిన అద్భుతమైన డెలివరీకి కాన్వే దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఈ ఢిల్లీ పేసర్ కాన్వేకు గుడ్ లెంగ్త్ బాల్‌గా సంధించాడు.

బంతి ఆఫ్ స్టంప్ దగ్గర పిచ్ అయ్యి లోపలికి దూసుకొచ్చింది. కాన్వే ఆ బంతిని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో బంతి నేరుగా వెళ్లి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. వెంటనే హర్షిత్ రాణా తనదైన శైలిలో దూకుడుగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వైపు వేలు చూపిస్తూ చెప్పా కాదా అంటూ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అంతకుముందు తొలి వన్డేలో రాణా రెండు వికెట్లతో పాటు 29 పరుగులు చేశాడు. తనపై విమర్శలు చేస్తున్నవారికి తన ప్రదర్శనలతో రాణా సమాధనమిస్తున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌(112) అజేయ సెంచరీతో మెరిశాడు.
చదవండి: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మిస్టరీ స్పిన్నర్‌


 

 

Videos

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)