Breaking News

టెస్ట్‌ల్లో సరికొత్త 'నంబర్‌ వన్‌'

Published on Wed, 06/10/2026 - 16:17

ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ సరికొత్త నంబర్‌ వన్‌ టెస్ట్‌ బ్యాటర్‌గా అవతరించాడు. సహచరుడు జో రూట్‌ను వెనక్కు నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. తాజాగా లార్డ్స్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌లో అర్ద సెంచరీ సాధించి నంబర్‌ వన్‌ స్థానానికి చేరాడు. ఇదే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో ఘోరంగా విఫలమైన రూట్‌ రెండు స్థానాలు దిగజారి మూడో స్థానంలో ఉన్నాడు. ఈ మధ్యలో ఆసీస్‌ ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌ ఓ స్థానం మెరుగుపర్చుకొని రెండో స్థానానికి ఎగబాకాడు.

తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో సూపర్‌ సెంచరీతో సత్తా చాటిన టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి చేరాడు. 743 రేటింగ్‌ పాయింట్లు కలిగిన గిల్‌.. ప్రస్తుతం భారత్‌ తరఫున అత్యధిక రేటింగ్ కలిగిన బ్యాటర్‌గా నిలిచాడు.

ఇదే మ్యాచ్‌లో సెంచరీ చేసిన మరో టీమిండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ ర్యాంక్‌లో (34) ఎలాంటి మార్పు లేదు. గిల్‌తో పాటు టాప్‌-10లో ఉన్న మరో టీమిండియా బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ ఓ స్థానంలో కోల్పోయి తొమ్మిదో స్థానానికి చేరాడు. ఓవరాల్‌గా తాజా ర్యాంకింగ్స్‌లో అత్యధిక లబ్ది పొందిన బ్యాటర్‌గా గ్లెన్‌ ఫిలిప్స్‌ ఉన్నాడు. ఫిలిప్స్‌ తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో ఓ మోస్తరు ప్రదర్శన చేసినప్పటికీ.. 15 స్థానాలు మెరుగుపర్చుకొని 40వ స్థానానికి ఎగబాకాడు.

బౌలర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. భారత పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. న్యూజిలాండ్‌ టెస్ట్‌లో కళ్లు చెదిరే ప్రదర్శన ఇచ్చిన ఇంగ్లండ్‌ పేసర్‌ గస్‌ అట్కిన్సన్‌ 7 స్థానాలు మెరుగుపర్చుకొని పదో స్థానానికి ఎగబాకాడు. ఆఫ్ఘన్‌ టెస్ట్‌లో సంచలన ప్రదర్శన ఇచ్చిన టీమిండియా అరంగేట్రం స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌ తొలిసారి టాప్‌-100లోకి ప్రవేశించాడు. ఆ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన సుతార్‌ 272 రేటింగ్‌ పాయింట్లు సాధించి 72వ స్థానంలో నిలిచాడు.

మిగతా భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ ఓ స్థానం​ మెరుగుపర్చుకొని 14వ స్థానానికి చేరగా.. సిరాజ్‌ ఓ స్థానం కోల్పోయి 15వ స్థానానికి పడిపోయాడు. ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. టీమిండియా వెటరన్‌ ఆటగాడు రవీంద్ర జడేజా టాప్‌ ప్లేస్‌ను నిలుపుకున్నాడు. వాషింగ్టన్‌ సుందర్‌ 2 స్థానాలు మెరుగుపర్చుకొని తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. 

Videos

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

Photos

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)