Breaking News

IND vs ENG: హ్యారీ బ్రూక్‌ ‘ఫాస్టెస్ట్‌’ టెస్టు రికార్డు

Published on Mon, 08/04/2025 - 14:38

టీమిండియాతో ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ యువ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ (Harry Brook) అదరగొట్టాడు. బజ్‌బాల్‌ ఆటను గుర్తుచేస్తూ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. 35వ ఓవర్లో ప్రసిద్‌ కృష్ణ బౌలింగ్‌లో బ్రూక్‌ బంతిని గాల్లోకి లేపగా.. ఫైన్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ చక్కటి క్యాచ్‌ అందుకున్నాడు.

సిరాజ్‌ ఇచ్చిన ‘గిఫ్ట్‌’
కానీ.. బంతిని ఒడిసిపట్టిన తర్వాత సిరాజ్‌ బౌండరీ లైన్‌ తొక్కి.. బ్యాలెన్స్‌ చేసుకోలేక లైన్‌ అవతల ల్యాండ్‌ అయ్యాడు. దీంతో కథ అడ్డం తిరిగింది. అవుటవ్వాల్సిన బ్రూక్‌ ఖాతాలోకి.. సిక్సర్‌ చేరిపోయింది. అప్పటికి బ్రూక్‌  స్కోరు 19. ఇలా తనకు లైఫ్‌ లభించిన తర్వాతే.. అతడు మరి వెనుదిరిగి చూడలేదు.

ఆకాశమే హద్దుగా చెలరేగుతూ శతక్కొట్టేశాడు. కేవలం 98 బంతుల్లోనే 14 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 111 పరుగులు సాధించాడు. జో రూట్‌ (105)తో కలిసి ఇంగ్లండ్‌ను పటిష్ట స్థితికి చేర్చాడు. కాగా బ్రూక్‌కు టెస్టుల్లో ఇది పదో సెంచరీ.

హ్యారీ బ్రూక్‌ ‘ఫాస్టెస్ట్‌’ టెస్టు రికార్డు
ఈ క్రమంలో బ్రూక్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇరవై ఒకటవ శతాబ్దంలో టెస్టులో అత్యంత వేగంగా టెస్టుల్లో పది శతకాల మార్కు అందుకున్న ప్లేయర్‌గా నిలిచాడు. బ్రూక్‌ 50 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించి.. ఆస్ట్రేలియా స్టార్‌ మార్నస్‌ లబుషేన్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. కాగా 70 ఏళ్ల క్రితం అంటే.. 1955లో వెస్టిండీస్‌ క్రికెటర్‌ క్లైడ్‌ వాల్కాట్‌ 47 ఇన్నింగ్స్‌లోనే 10 టెస్టు సెంచరీలు సాధించి ఆల్‌టైమ్‌ రికార్డు నెలకొల్పాడు.

ఇదిలా ఉంటే.. భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య ఓవల్‌ మైదానంలో గురువారం మొదలైన ఐదో టెస్టు తుది అంకానికి చేరుకుంది. సోమవారం ఆఖరిదైన ఐదో రోజు ఆటలో మ్యాచ్‌తో పాటు సిరీస్‌ ఫలితం తేలనుంది. కాగా ఆండర్సన్‌- టెండుల్కర్‌ ట్రోఫీలో భాగంగా ఇరుజట్ల మధ్య నాలుగు టెస్టులు పూర్తి కాగా.. ఆతిథ్య ఇంగ్లండ్‌ టీమిండియాపై 2-1తో ఆధిక్యంలో ఉంది.  

21వ శతాబ్దంలో టెస్టుల్లో అత్యంత వేగంగా 10 టెస్టు సెంచరీలు సాధించిన క్రికెటర్లు
👉హ్యారీ బ్రూక్‌- 50 ఇన్నింగ్స్‌లో
👉మార్నస్‌ లబుషేన్‌- 51 ఇన్నింగ్స్‌లో
👉కెవిన్‌ పీటర్సన్‌- 56 ఇన్నింగ్స్‌లో
👉ఆండ్రూ స్ట్రాస్‌- 56 ఇన్నింగ్స్‌లో
👉వీరేందర్‌ సెహ్వాగ్‌- 56 ఇన్నింగ్స్‌లో.

చదవండి: అతడిని ముందుగానే తీసుకురావాల్సింది: గిల్‌, గంభీర్‌ తీరుపై అశ్విన్‌ ఆగ్రహం
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)