Breaking News

గంభీర్ త‌ప్పు చేశాడు..! అవార్డు నాకు కాదు అత‌డికి ఇవ్వాల్సింది!

Published on Wed, 08/06/2025 - 16:25

భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 2-2తో స‌మంగా ముగిసిన సంగ‌తి తెలిసిందే. ఓవ‌ల్ వేదిక‌గా జ‌రిగిన ఆఖ‌రి టెస్టులో 6 ప‌రుగుల తేడాతో సంచ‌ల‌న విజ‌యం సాధించిన భార‌త జ‌ట్టు సిరీస్‌ను స‌మం చేసింది.  ఓవ‌ల్ టెస్టులో మ్యాచ్ విన్నింగ్ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన టీమిండియా స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. 

అదేవిధంగా ఇంగ్లండ్ స్టార్ బ్యాట‌ర్ హ్యారీ బ్రూక్‌, టీమిండియా కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్‌ ప్లేయ‌ర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డులు గెలుచుకున్నారు. ఎప్ప‌టినుంచో వ‌స్తున్న అన‌వాయితీ ప్ర‌కారం ఇరు జ‌ట్ల ప్ర‌ధాన కోచ్‌లు ప్లేయ‌ర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డులు ఎవ‌రికి ఇవ్వాలో నిర్ణ‌యించారు.

ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండ‌న్ మెక‌ల్ల‌మ్ టీమిండియా కెప్టెన్ గిల్‌ను ఎంపిక చేయ‌గా.. భార‌త ప్ర‌ధాన కోచ్ ఇంగ్లండ్ యువ క్రికెట‌ర్ హ్యారీ బ్రూక్‌ను ఎంచుకున్నాడు. అయితే గంభీర్ నిర్ణ‌యం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ సిరీస్‌ అసాంతం అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శన క‌న‌బ‌రిచిన స్టార్ బ్యాట‌ర్ జో రూట్‌ను కాద‌ని బ్రూక్‌ను సెల‌క్ట్ చేయ‌డం చాలా మంది త‌ప్పుబ‌ట్టారు.  గంభీర్ నిర్ణ‌యంతో బ్రూక్ కూడా షాక‌య్యాడంట‌.

ఇదే విష‌యంపై బీబీసీతో బ్రూక్ మాట్లాడుతూ.. "నేను ఈ సిరీస్‌లో అంత‌ మెరుగ్గా రాణించ‌లేక‌పోయాను.  జో రూట్ లాగా ఎక్కువ ప‌రుగులు కూడా చేయ‌లేక‌పోయాను. కాబ‌ట్టి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డుకు అత‌డే ఆర్హుడు. అత‌డే మ్యాన్ ఆఫ్‌ది సిరీసే కాదు, మ్యాన్ ఆఫ్‌ది స‌మ్మ‌ర్ కూడా. 

రూట్ ఎన్నో ఏళ్ల‌గా జ‌ట్టుకు త‌న సేవ‌ల‌ను అందిస్తూ వ‌స్తున్నాడు" చెప్పుకొచ్చాడు. కాగా ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రూట్ 537 ప‌రుగులు చేయ‌గా.. బ్రూక్ 481 ర‌న్స్ చేశాడు. శుబ్‌మ‌న్ అయితే ఏకంగా నాలుగు సెంచరీలతో 754 పరుగులు చేశాడు.
చదవండి: నువ్వు గొప్పోడివి సిరాజ్‌: విరాట్‌ కోహ్లి అక్క భావన పోస్ట్‌ వైరల్‌
 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)