Breaking News

శ్రేయస్ అయ్యర్ పాస్‌.. ఫిట్‌నెస్ టెస్టుకు హార్దిక్ పాం‍డ్యా

Published on Mon, 08/11/2025 - 17:39

ఆసియాక‌ప్‌-2025 ముందు భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా త‌న ఫిట్‌నెస్‌ను ప‌రీక్షించుకోనున్నాడు. తాజాగా పాండ్యా బెంగ‌ళూరులోని బీసీసీఐ సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో చేరాడు.  ఈ మెగా టోర్నీ ముంగిట  చాలా మంది భార‌త ఆట‌గాళ్లు సీవోఎకు క్యూ క‌ట్టారు. 

టీమిండియా వైట్‌బాల్ సెటాప్‌లో భాగ‌మైన పాండ్యా.. ఐపీఎల్-2025 ముగిసిన త‌ర్వాత దాదాపు రెండు నెల‌ల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. గ‌త నెల రోజుల నుంచి త‌న  శిక్షణ ప్రారంభించాడు. ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం..  పాండ్యా ఆగస్టు 11, 12 తేదీల్లో త‌న‌ ఫిట్‌నెస్ టెస్టు చేసుకోనున్నాడు. ఈ బ‌రోడా ఆల్‌రౌండ‌ర్ ఆదివారం త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎన్సీఎకి ఒక చిన్న ట్రిప్ అనే క్యాప్షన్‌తో స్టోరీని షేర్ చేశాడు.

అయ్య‌ర్ పాస్‌..
మ‌రోవైపు ఎన్సీఎలో ఉన్న భార‌త మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ త‌న ఫిట్‌నెస్ ప‌రీక్ష‌ను జూలై 27-29 పూర్తి చేసిన‌ట్లు తెలుస్తోంది. అత‌డు ఆసియాక‌ప్‌-2025తో తిరిగి టీ20 జ‌ట్టులోకి రానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. 
మిడిల్ ఆర్డర్‌లో అనుభ‌వం ఉన్న బ్యాట‌ర్ జ‌ట్టుకు అవ‌స‌ర‌మ‌ని సెల‌కర్లు భావిస్తున్న‌ట్లు స‌మాచారం. 

ఐపీఎల్‌-2025లో అయ్య‌ర్ అద్బుతంగా రాణించిడంతో అత‌డికి తిరిగి పిలుపునిచ్చేందుకు సెలక్ట‌ర్లు సిద్ద‌మైన‌ట్లు వినికిడి. ఇక టీమిండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ మ‌రోవారంలో తన పూర్తి ఫిట్‌నెస్‌ను పొంద‌నున్న‌ట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

ఇక ఈ ఖండాంతర టోర్నీ సెప్టెంబ‌ర్ 9 నుంచి ప్రారంభం కానుంది. భార‌త్‌ త‌మ తొలి మ్యాచ్‌లో సెప్టెంబ‌ర్ 10న దుబాయ్ వేదిక‌గా హాంకాంగ్‌తో తలపడనుంది. అనంతరం సెప్టెంబర్‌ 14న చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుం‍ది.
చదవండి: 'అతడొక టాలెంటెడ్ ప్లేయర్‌.. చేజేతులా కెరీర్ నాశనం చేసుకున్నాడు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)