హార్దిక్‌ పాండ్యా కీలక నిర్ణయం

Published on Tue, 12/30/2025 - 16:32

టీమిండియా సీమ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కీలక నిర్ణయం తీసుకున్నాడు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశాల మేరకు మరోసారి దేశీ క్రికెట్‌ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఆసియా టీ20 కప్‌-2025 సందర్భంగా గాయపడిన హార్దిక్‌ పాండ్యా.. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీతో కాంపిటేటివ్‌ క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చాడు.

సొంతజట్టు బరోడా తరఫున దేశీ టీ20లు ఆడాడు హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya). తాజాగా దేశీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో అతడు భాగం కానున్నాడు. జనవరి 3, 8వ తేదీల్లో బరోడా.. విదర్భ, చండీగఢ్‌ జట్లతో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌లలో హార్దిక్‌ పాండ్యా ఆడేందుకు నిర్ణయించుకున్నట్లు అతడి సన్నిహిత వర్గాలు IANSకు తెలిపాయి.

అయితే, ఈ రెండు మ్యాచ్‌లకు మధ్య బరోడా.. జమ్మూ కశ్మీర్‌తో జనవరి 6న తలపడనుంది. ఈ మ్యాచ్‌కు మాత్రం హార్దిక్‌ పాండ్యా దూరంగా ఉండనున్నాడు. టీ20 ప్రపంచకప్‌-2026 సన్నాహకాల దృష్ట్యా ఈ మేరకు విశ్రాంతి తీసుకుంటూ.. తదుపరి మ్యాచ్‌లలో ఆడనున్నాడు.

విశ్రాంతి తీసుకోమన్నా వినడే!
టీమిండియా తదుపరి న్యూజిలాండ్‌తో స్వదేశంలో వన్డే సిరీస్‌ ఆడనున్న విషయం తెలిసిందే. అయితే, మేనేజ్‌మెంట్‌ మాత్రం ఈ సిరీస్‌ నుంచి హార్దిక్‌కు విశ్రాంతినివ్వాలని భావిస్తోంది. కివీస్‌తో ఐదు టీ20లు సహా వరల్డ్‌కప్‌ టోర్నీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

అయితే, పాండ్యా మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ కోసం బరోడా తరఫున బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. కాగా చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భాగంగా హార్దిక్‌ పాండ్యా ఈ ఏడాది మార్చిలో చివరగా వన్డే మ్యాచ్‌ ఆడాడు.

రో-కో ఆడేశారు
కాగా బీసీసీఐ ఆదేశాల మేరకు ఇప్పటికే భారత బ్యాటింగ్‌ దిగ్గజాలు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి.. తమ సొంత జట్లు ముంబై, ఢిల్లీ తరఫున రెండేసి విజయ్‌ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు ఆడారు. టీమిండియా యంగ్‌ స్టార్లు రిషభ్‌ పంత్‌ ఢిల్లీ కెప్టెన్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఆంధ్ర సారథిగా ఈ టోర్నీలో భాగం కాగా.. అభిషేక్‌ శర్మ కూడా పంజాబ్‌ తరఫున బరిలోకి దిగాడు. 

ఇక శుబ్‌మన్‌ గిల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ తదుపరి మ్యాచ్‌లలో పంజాబ్‌కు ఆడతారు. సంజూ శాంసన్‌ కేరళ తరఫున, రవీంద్ర జడేజా సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగనున్నారు.

చదవండి: టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)