Breaking News

మరో 10 ఏళ్లు ఆడతా.. 10 ఐసీసీ ట్రోఫీలు గెలుస్తా: హార్దిక్‌

Published on Tue, 03/10/2026 - 08:30

టీ20 ప్రపంచకప్‌-2026 విజేతగా భారత్‌ నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి టీమిండియా ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ విజయంపై టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా స్పందించాడు. వరుసగా రెండో టి20 ప్రపంచకప్‌ విజయంలో భాగమవడం ఎంతో ఆనందంగా ఉందని భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా అన్నాడు. 

ఈ మెగా టోర్నీలో రెండు అర్ధ సెంచరీలు సహా పేస్‌ బౌలింగ్‌తో మొత్తం 9 వికెట్లు పడగొట్టిన హార్దిక్‌ కొన్ని మ్యాచ్‌ల్లో కీలక సమయాల్లో మెరుపులు మెరిపించాడు. అతని నిలకడను గుర్తించిన అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టి20 ప్రపంచకప్‌ జట్టులో ఆల్‌రౌండర్‌గా స్థానం క‌ల్పించింది.

పాండ్యాతో పాటు శాంస‌న్‌, ఇషాన్, బుమ్రా ఐసీసీ టీమ్‌లో ఉన్నారు. 32 ఏళ్ల పాండ్యా 18 నెలల క్రితం బార్బడోస్‌ (2024)లో రోహిత్‌ సారథ్యంలో ప్రపంచకప్‌ గెలిచినప్పుడు భావోద్వేగానికి గురయ్యాడు. ఆనందబాష్పాలతో విజయోత్సంలో పాల్గొన్న ఈ ఆల్‌రౌండర్‌ అప్పుడు ఆత్మ ప్రమాణం చేసుకున్నానని చెప్పుకొచ్చాడు.

‘నాడు దక్షిణాఫ్రికాపై (2024లో) కప్‌ గెలవగానే... ఇకమీదట భారత్‌ తరఫున ఏ టోర్నీలో బరిలోకి దిగినా... జట్టు గెలవడానికే ఆడతాను. ట్రోఫీని సగర్వంగా ఎత్తుతాను అని నా మనసుకు నేను ప్రమాణం చేశాను. ఇప్పుడు కివీస్‌పై విజయంతో నా వాగ్దానాన్ని నెరవేర్చుకున్నానన్న సంతృప్తి కలిగింది. అయితే ఇది ఇక్కడితోనే ఆగిపోదు.

నాలో ఇంకా 10 ఏళ్ల క్రికెట్ ఉంది. ఆ పదేళ్లలో 10 ఐసీసీ టైటిల్స్ గెలవాలన్నదే నా లక్ష్యం. సొంతగడ్డపై వరల్డ్ కప్ గెలవడం చాలా ఎమోషనల్. నిన్నటి నుంచే మేమే ఛాంపియన్లమని నాకు తెలుసు. గెలుపు తప్ప మరో ఆలోచనే నాకు లేదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే" అని హార్దిక్‌ పాండ్యా పేర్కొన్నాడు. 

ఆ ప్రపంచకప్‌ (2024) సమయంలో తాను ఎన్నో వ్యక్తిగత సమస్యలతో సతమతమయ్యానని చెప్పాడు. అందుకే ఇతరత్రా విషయాల్ని పక్కనబెట్టి ఆటపైనే దృష్టి పెట్టేందుకు స్వీయ వాగ్దానం చేసుకున్నట్లు చెప్పాడు.
చదవండి: T20 WC 2026: పాపం పాకిస్తాన్‌..! మ‌రోసారి ‘టీ కప్’తో ట్రోల్ చేసిన వరుణ్

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)