ఇంగ్లండ్‌ సిరీస్‌కు పాండ్యా దూరం.. కోహ్లీ ఆడడంపై ఆరోజే క్లారిటీ!

Published on Sat, 06/20/2026 - 13:19

టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌కు దూర‌మైన‌ట్లు తెలుస్తోంది. తొడ కండ‌రాల గాయంతో బాధ‌ప‌డుతున్న హార్దిక్ పాండ్యా కోలుకోవ‌డానికి మ‌రికొంత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశ‌ముందని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ (సీవోఈ) శిబిరంలో ఉన్న పాండ్యా అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు కూడా దూర‌మ‌య్యాడు. 

అయితే ఇంగ్లండ్ సిరీస్‌కు ఇంకా స‌మ‌యం ఉండ‌డంతో అప్ప‌టివ‌ర‌కు పాండ్యా కోలుకుంటాడ‌ని వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ, బీసీసీఐ మెడిక‌ల్ బృందం మాత్రం పాండ్యా ఇంగ్లండ్ వెళ్లేందుకు సిద్ధంగా లేడ‌ని తెలిపింది. ఎందుకంటే రీహాబిలిటేష‌న్ సెంట‌ర్‌లో ఉన్న పాండ్యా ఫిట్‌నెస్ టెస్టులో విఫ‌ల‌మ‌య్యాడ‌ని, అత‌డు కోలుకునేందుకు మ‌రో నెల రోజులు ప‌ట్టే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం. 

అయితే ఇంగ్లండ్ గ‌డ్డ‌పై టీమిండియా జూలై 14 నుంచి 19 మ‌ధ్య మూడు వ‌న్డేలు ఆడ‌నుంది. ఈ లెక్క‌న హార్దిక్ టీమిండియాతో జాయిన్ కావ‌డం క‌ష్ట‌మే. ఇక గాయంతో బాధ‌ప‌డుతున్న కోహ్లీ కూడా ఇంగ్లండ్ సిరీస్‌లో ఆడుతాడా లేదా అనేది జూన్ 22న (సోమ‌వారం) తేల‌నుంది. ఆరోజు కోహ్లికి ఫిట్‌నెస్ టెస్టు జ‌ర‌గ‌నుంది.

అయితే అఫ్గానిస్తాన్‌, ఇంగ్లండ్ టూర్ల‌కు హార్దిక్ పాండ్యాను ఎంపిక చేస్తూ బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ నిర్ణ‌యం తీసుకుంది. వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ రోడ్‌మ్యాప్ ప్ర‌క్రియ‌లో భాగంగా పాండ్యా కీల‌కం కానున్నాడ‌ని అజిత్ అగార్క‌ర్ వెల్ల‌డించాడు. కానీ ఐపీఎల్ 2026 సీజ‌న్ చివ‌ర్లో వెన్ను గాయంతో బాధ‌ప‌డ్డ పాండ్యా సీవోఈకి చేరుకున్నాడు. వెన్ను నొప్పి నుంచి తేరుకునే లోపే తొడ కండ‌రాల గాయం కావ‌డంతో ఆఫ్గ‌న్‌తో వ‌న్డే సిరీస్ ప్రారంభానికి ఒక్క‌రోజు ముందే పాండ్యా ఆడ‌డం లేద‌ని బీసీసీఐ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆడేనా?
వ‌రుస గాయాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న పాండ్యా వ‌చ్చే ఏడాది వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆడుతాడా లేదా అన్న‌ది మిస్ట‌రీగా మారింది. టీమిండియా కూడా ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్ అనంత‌రం మ‌ళ్లీ సెప్టెంబ‌ర్‌లో వెస్టిండీస్ టూర్‌లో వ‌న్డే మ్యాచ్‌లు ఆడ‌నుంది. అప్ప‌టికి కోలుకొని పాండ్యా జ‌ట్టులోకి వ‌స్తే మంచిదే, కానీ మ‌ళ్లీ ఏదైనా గాయం బారిన ప‌డితే మాత్రం వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు పాండ్యా అందుబాటులో ఉండేది అనుమానమే.

Read: నోరు మూసుకున్నందుకు రెడ్‌కార్డ్‌.. ఫిఫా చరిత్రలోనే తొలిసారి!

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)