Breaking News

T20 WC 2024: వరల్డ్‌కప్‌ తుదిజట్టులో పంత్‌కు నో ఛాన్స్‌!

Published on Sat, 06/01/2024 - 14:53

టీ20 ప్రపంచకప్‌-2024 నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్‌  హర్భజన్‌ సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తుదిజట్టు ఎంపికలో అత్యుత్తమ ఫామ్‌ ఆధారంగానే ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకోవాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.

కాగా వరల్డ్‌కప్‌-2024కు అమెరికా- వెస్టిండీస్‌ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. గ్రూపు-ఏలో ఉన్న భారత జట్టు లీగ్‌ దశలో తమ మ్యాచ్‌లన్నీ అమెరికాలోనే ఆడనుంది. ఇక ఇందుకోసం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.

రోహిత్‌ శర్మ సారథ్యంలోని ఈ టీమ్‌లో వికెట్‌ కీపర్‌ కోటాలో రిషభ్‌ పంత్‌, సంజూ శాంసన్‌ చోటు దక్కించుకోగా.. కేఎల్‌ రాహుల్‌కు మొండిచేయి ఎదురైంది. ఐపీఎల్‌-2024లో సంజూ రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌,బ్యాటర్‌గా అత్యుత్తమంగా రాణించి తన బెర్తును ఖరారు చేసుకోగా.. పంత్‌ ఐపీఎల్‌ తర్వాత నేరుగా దాదాపు ఏడాదిన్నర తర్వాత టీమిండియా తరఫున బరిలో దిగనున్నాడు.

ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌ ఆడే భారత తుదిజట్టులో పంత్‌ను కాదని సంజూ శాంసన్‌కు చోటిచ్చాడు హర్భజన్‌ సింగ్‌. స్టార్‌ స్పోర్ట్స్‌ షో గేమ్‌ ప్లాన్‌లో భాగంగా.. తన ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ఎంచుకున్న భజ్జీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

‘‘నా అభిప్రాయం ప్రకారం.. రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌తో కలిసి ఓపెనింగ్‌ చేయాలి. వన్‌డౌన్‌లో విరాట్‌ కోహ్లి రావాలి. ఆ తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌.

అనంతరం సంజూ శాంసన్‌. అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి తననే ఆడించాలి. ఇక ఆరో స్థానంలో హార్దిక్‌ పాండ్యా.. ఏడో నంబర్‌లో రవీంద్ర జడేజా. యజువేంద్ర చహల్‌ను కూడా తప్పకుండా ఆడించాలి.

అతడితో పాటు ముగ్గురు సీమర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌.. వీళ్లంతా తుదిజట్టులో ఉండాలి’’ అని హర్భజన్‌ సింగ్‌ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

అయితే, పిచ్‌ గనుక స్పిన్‌కు మరీ అంత అనుకూలంగా లేదని భావిస్తే.. అదనపు స్పిన్నర్‌ను వదిలేసి అతడి స్థానంలో శివం దూబేను ఆడించాలని భజ్జీ సూచించాడు. ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌ జట్టుతో ఉంటే బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఇంకాస్త పటిష్టంగా మారుతుందని పేర్కొన్నాడు. తన  దృష్టిలో కుల్దీప్‌ యాదవ్‌ అదనపు స్పిన్నర్‌ మాత్రమేనని హర్భజన్‌ పేర్కొన్నాడు.

చదవండి: T20 World Cup 2024: పొట్టి ప్రపంచకప్‌ విశేషాలు, రికార్డులు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)