Breaking News

అంట్లు తోముకోవాల్సి వచ్చింది: మండిపడ్డ పాక్‌ కెప్టెన్‌

Published on Wed, 02/18/2026 - 16:08

పాకిస్తాన్‌ హాకీ ఫెడరేషన్‌ (పీహెచ్‌ఎఫ్‌) తీరుపై ఆ దేశ హాకీ జట్టు కెప్టెన్‌ షకీల్‌ అమ్మద్‌ బట్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. PHF ప్రస్తుత యాజమాన్యంతో కలిసి తాము పనిచేయలేమని తేల్చిచెప్పాడు. దేశం కాని దేశంలో తమను రోడ్ల వెంట పరిగెత్తించి.. ఆఖరికి అంట్లు తోముకునేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.

అసలేం జరిగిందంటే.. FIH Pro Leagueలో భాగంగా తమ మ్యాచ్‌లు ఆడేందుకు పాక్‌ జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లింది. అయితే, వారి వసతికి సంబంధించి సరైన ఏర్పాట్లు చేయడంలో PHF విఫలమైంది. కాన్‌బెర్రా వెళ్లేందుకు పాక్‌ జట్టు సిడ్నీ విమానాశ్రయంలో దాదాపు 13-14 గంటల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది.

అనంతరం హోటల్‌కు వెళ్లిన తర్వాత పాక్‌ హాకీ జట్టుకు మరో ఘోర అవమానం ఎదురైంది. వారి పేరిట అడ్వాన్స్‌ బుకింగ్‌ లేకపోవడంతో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించింది. దీంతో గంటల పాటు పాక్‌ హాకీ ఆటగాళ్లు రోడ్ల మీద తిరగాల్సి వచ్చింది. ఆ మరుసటి రోజు మధ్యాహ్నమే మ్యాచ్‌ ఆడాల్సి ఉండగా.. ఆసీస్‌ చేతిలో పాక్‌ ఓడిపోయింది. అనంతరం జర్మనీ చేతిలోనూ ఓటమిపాలైంది.

మా అంట్లు మేమే తోముకోవాల్సి వచ్చింది
ఈ నేపథ్యంలో తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి పాకిస్తాన్‌ హాకీ జట్టు కెప్టెన్‌ షకీల్‌ అహ్మద్‌ బట్‌ స్వదేశానికి వచ్చిన తర్వాత లాహోర్‌ ఎయిర్‌పోర్టులో మీడియాకు వెల్లడించాడు. ‘‘ప్రస్తుత హాకీ ఫెడరేషన్‌ యాజమాన్యంతో కలిసి మేము పనిచేయలేము.

మ్యాచ్‌ ఆడేందుకు వెళ్లే ముందు మా అంట్లు మేమే తోముకోవాల్సి వచ్చింది. అలాంటపుడు మ్యాచ్‌ ఫలితం గురించి ఆలోచించే సమయం మాకు ఎక్కడ ఉంటుంది?.. అసలు మ్యాచ్‌ ఆడతామో లేదో తెలియని పరిస్థితి. ఇక ఫలితం గురించి అడగటం ఎందుకు?

మాకు విదేశీ కోచ్‌ కావాలి
మేము పది రోజుల పాటు చీప్‌ ఏరియాలో ఉండాల్సి వచ్చింది. ఇంతకంటే ఘోరం ఏముంటుంది? ఈ విషయాల గురించి మీడియాతో మాట్లాడవద్దని మా ఫెడరేషన్‌ హెచ్చరికలు జారీ చేసింది. అయితే, ఆస్ట్రేలియాలో మాకు ఏం జరిగిందో అందరికీ తెలియాలి కాబట్టే నేను మాట్లాడుతున్నాను.

మాకు విదేశీ కోచ్‌ కావాలి. అప్పుడే అనుకున్న ఫలితాలు రాబట్టగలము. యాజమాన్యం కూడా మంచిగా ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది’’ అని షకీల్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా పాక్‌ హాకీ ఫెడరేషన్‌కు ప్రాటన్‌-ఇన్‌-చీఫ్‌గా ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ ఉంటారు.

ప్రధాని దృష్టికి తీసుకువెళ్తాము
ఈ నేపథ్యంలో పీఎస్‌బీ డైరెక్టర్‌- జరనల్‌ నూర్‌ సభా స్పందిస్తూ.. ఆటగాళ్ల ఆరోపణలపై విచారణ చేస్తున్నామని.. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్తామని చెప్పుకొచ్చాడు. 

కాగా FIH Pro Leagueలో పాకిస్తాన్‌ ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఎనిమిది ఓడిపోయి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానం (తొమ్మిది)లో ఉంది. మరోవైపు.. బెల్జియం ఎనిమిదింట ఏడు గెలిచి అగ్రస్థానంలో ఉండగా.. భారత్‌ నాలుగింటికి నాలుగు ఓడి ఎనిమిదో స్థానంలో ఉంది.

చదవండి: IND vs PAK: అసలైన హీరో మీరే: పీసీబీ చైర్మన్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు