Breaking News

అత‌డికి బ్రేక్ ఇవ్వండి.. సంజూను జ‌ట్టులోకి తీసుకోండి: వీరేంద్ర సెహ్వాగ్

Published on Thu, 02/26/2026 - 17:33

టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా మ‌రో కీల‌క పోరుకు  సిద్ద‌మైంది. గురువారం చెన్నై వేదిక‌గా జింబాబ్వేతో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. సెమీస్ రేసులో నిల‌వాలంటే సూర్య సేన‌ క‌చ్చితంగా ఈ మ్యాచ్‌లో గెలవాల్సిందే. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భార‌త జ‌ట్టు మెనెజ్‌మెంట్‌కు టీమిండియా మాజీ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ కీల‌క సూచ‌న చేశాడు. 

ఫామ్ లేమితో తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్న అభిషేక్ శ‌ర్మ‌ను త‌ప్పించి సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలని సెహ్వాగ్ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఈ మెగా టోర్నీలో అభిషేక్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు 4 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ కేవ‌లం 15 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. అందులో మూడు డ‌కౌట్లు ఉండ‌డం గ‌మ‌నార్హం. దీంతో అత‌డిని జ‌ట్టు నుంచి త‌ప్పించాల‌ని ప‌లువురు మాజీలు సూచిస్తున్నారు.

"నేను గ‌నుక టీమ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా ఉంటే, అభిషేక్‌కు విశ్రాంతి ఇచ్చే వాడిని. అత‌డి స్ధానంలో సంజూ శాంస‌న్‌ను అవకాశ‌మిస్తాను. ఏదైనా ప్ర‌య‌త్నం చేయాలంటే ఈ మ్యాచ్‌లోనే చేయాలి. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో భార‌త్ ఓడిపోతే, టోర్నీ నుంచి నిష్క్ర‌మిస్తారు. ఇది చాలా కీల‌కమైన మ్యాచ్‌. కాబట్టి ఆట‌గాళ్ల ఫామ్ ఆధారంగా భా తమ అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోవాలి.

తుది జ‌ట్టు ఎంపిక‌లో మార్పులు క‌చ్చితంగా ఉంటాయని అనుకుంటున్నాను. భార‌త్ స‌రైన వ్యూహాల‌తో బ‌రిలోకి దిగుతోంది. కానీ వాటిని అమ‌లు చేయ‌డంలో మాత్రం విఫ‌ల‌మ‌వుతోంది. ఈ మ్యాచ్‌లో భార‌త్ త‌మ వ్యూహాల‌కు మ‌రింత ప‌దును పెట్టే అవ‌కాశ‌ముంది. అభిషేక్ శర్మ,  తిలక్ వర్మ ఇద్దరూ మంచి ఫామ్‌లో లేర‌న్న విష‌యం మెనెజ్‌మెంట్ గుర్తుంచుకోవాలి" అని క్రిక్‌బ‌జ్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)