Breaking News

గిల్‌ స్థానంలో అతడే ఆడతాడు: టీమిండియా కోచ్‌

Published on Thu, 11/20/2025 - 16:05

సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) ఆడతాడా? లేదా? అన్న సందిగ్దం నెలకొంది. కోల్‌కతాలో తొలి టెస్టు సందర్భంగా మెడ నొప్పి కారణంగా గిల్‌ మధ్యలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా.. మరుసటి రోజు డిశ్చార్జ్‌ అయ్యాడు.

అయితే, గిల్‌ మెడ నొప్పి మాత్రం పూర్తిగా తగ్గలేదు. ఇంకా పూర్తిస్థాయిలో మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ కూడా సాధించలేదు. ఈ నేపథ్యంలోనే అతడు గువాహటి టెస్టు ఆడడనే వార్తలు వచ్చాయి. ఈ విషయంపై టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్‌ (Sitanshu Kotak) గురువారం స్పందించాడు.

కెప్టెన్‌ కోలుకుంటున్నాడు
‘‘గిల్‌ కోలుకుంటున్నాడు. నిన్ననే అతడిని కలిశాను. తనకు పెద్దగా సమస్య లేదు. అయితే, అతడు ఆడతాడా? లేదా అన్న అంశంపై శుక్రవారం సాయంత్రమే స్పష్టత వస్తుంది. ఫిజియోలు, డాక్టర్ల నిర్ణయాన్ని బట్టే అతడి ఆడించాలా? వద్దా? అన్నది తేలుతుంది.

ప్రస్తుతానికి గిల్‌ వేగంగా కోలుకుంటున్నాడు. కానీ మ్యాచ్‌ సమయంలో నొప్పి మళ్లీ తిరగబెట్టే అవకాశాలను కొట్టిపడేయలేము. ఒకవేళ ఏదైనా తేడా అనిపిస్తే కచ్చితంగా అతడికి విశ్రాంతినిస్తాం. ఏదేమైనా కీలక బ్యాటర్‌, కెప్టెన్‌గా గిల్‌ సేవల్ని మాత్రం మేము కోల్పోతాము.

అయినా మరేం పర్లేదు. ఒకవేళ గిల్‌ ఆడకపోయినా.. మాకు చాలా మంది బ్యాటర్లు అందుబాటులో ఉన్నారు. వాళ్లంతా ప్రొఫెషనల్‌ ఆటగాళ్లే. జట్టు కోసం వచ్చి ఆడతారు. గిల్‌ ఆడాలనే మేమూ కోరుకుంటున్నాం. అయితే, అతడి ఆరోగ్యానికే మొదటి ప్రాధాన్యత. గిల్‌ స్థానంలో వచ్చే ఆటగాడు సెంచరీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

గిల్‌ స్థానంలో అతడే ఆడతాడు
గిల్‌ ఆడే నాలుగో స్థానంలో ధ్రువ్‌ జురెల్‌ అందుబాటులో ఉండనే ఉన్నాడు. అయితే, గిల్‌ ప్లేస్‌లో తుదిజట్టులోకి ఎవరు వస్తారనేది రేపే నిర్ణయిస్తాం’’ అని సితాన్షు కొటక్‌ తెలిపాడు. కాగా టీమిండియా- సౌతాఫ్రికా మధ్య శనివారం నుంచి మొదలయ్యే రెండో టెస్టుకు గువాహటిలోని బర్సపరా స్టేడియం వేదిక. 

ఇదిలా ఉంటే.. కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు సఫారీల చేతిలో 30 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. గువాహటిలో గెలిస్తేనే రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 1-1తో సమం చేయగలదు.

చదవండి: IPL 2026: ‘సన్‌రైజర్స్‌కు అతడు దొరకడు.. బ్యాటింగ్‌ ఒక్కటే సరిపోదు.. కాబట్టి’

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)