Breaking News

Ind vs Eng 1st Test: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్‌ గిల్‌

Published on Fri, 06/20/2025 - 17:21

టీమిండియా స్టార్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా ప్రయాణం మొదలుపెట్టిన ప్రిన్స్‌.. మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ, విరాట్‌ కోహ్లి (Virat Kohli) పేరిట ఉన్న అరుదైన రికార్డులు బద్దలు కొట్టాడు. కాగా ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో జస్‌ప్రీత్‌ బుమ్రా పేరు తెర మీదకు రాగా.. తానే స్వయంగా రేసు నుంచి తప్పుకొన్నాడు. పనిభారం కారణంగా సెలక్టర్లు కూడా ఇందుకు అంగీకరించి.. రోహిత్‌ స్థానంలో శుబ్‌మన్‌ గిల్‌కు టెస్టు జట్టు పగ్గాలు అప్పగించారు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో శుక్రవారం (జూన్‌ 20) మొదలైన తొలి టెస్టు సందర్భంగా సారథిగా గిల్‌ తన ప్రయాణం ఆరంభించాడు.

ఈ నేపథ్యంలో పలు అరుదైన రికార్డులను గిల్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. చిన్న వయసులోనే భారత టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన కెప్టెన్ల జాబితాలో చేరిన ప్రిన్స్‌.. 21వ శతాబ్దంలో అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన సారథిగా చరిత్రకెక్కాడు. ఇన్నాళ్లుగా కోహ్లి పేరిట ఉన్న ఈ రికార్డును బద్దలు కొట్టాడు.

అంతేకాదు.. ఇంగ్లండ్‌ గడ్డ మీద టెస్టుల్లో టీమిండియాకు నాయకత్వం వహించిన మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ పేరు మీదున్న రికార్డును కూడా గిల్‌ ఈ సందర్భంగా సవరించాడు. కాగా టెస్టుల్లో భారత్‌కు గిల్‌ 37వ కెప్టెన్‌.

యంగెస్ట్‌ ఇండియన్‌ టెస్టు కెప్టెన్లు
🏏మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ- 21 ఏళ్ల 77 రోజుల వయసులో- 1962లో బ్రిడ్జ్‌టౌన్‌ వేదికగా వెస్టిండీస్‌తో పోరుతో..
🏏సచిన్‌ టెండుల్కర్‌- 23 ఏళ్ల 169 రోజుల వయసులో- 1996లో ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో పోరుతో..
🏏కపిల్‌ దేవ్‌- 24 ఏళ్ల 48 రోజులు వయసులో- 1983లో కింగ్‌స్టన్‌ వేదికగా వెస్టిండీస్‌తో పోరుతో..
🏏రవి శాస్త్రి- 25 ఏళ్ల 229 రోజుల వయసులో- 1988లో చెన్నై వేదికగా- వెస్టిండీస్‌తో పోరుతో..
🏏శుబ్‌మన్‌ గిల్‌- 25 ఏళ్ల 285 రోజుల వయసులో- 2025లో లీడ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో పోరుతో..

21వ శతాబ్దంలో పిన్న వయసులో టీమిండియా టెస్టు కెప్టెన్లుగా తొలి మ్యాచ్‌ ఆడింది వీరే.. ఒకే ఒక్కడు గిల్‌!
🏏శుబ్‌మన్‌ గిల్‌- 25 ఏళ్ల 285 రోజుల వయసులో- 2025లో లీడ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో పోరుతో..
🏏విరాట్‌ కోహ్లి- 26 ఏళ్ల 34 రోజుల వయసులో- 2014లో అడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో పోరుతో..
🏏సచిన్‌ టెండుల్కర్‌- 26 ఏళ్ల 253 రోజుల వయసులో- 2000లొ సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో పోరుతో..
🏏మహేంద్ర సింగ్‌ ధోని- 26 ఏళ్ల 379 రోజుల వయసులో- 2008లొ కాన్పూర్‌ వేదికగా సౌతాఫ్రికాతో పోరుతో..
🏏వీరేందర్‌ సెహ్వాగ్‌- 27 ఏళ్ల 59 రోజుల వయసులో- 2006లో అహ్మదాబాద్‌ వేదికగా శ్రీలంకతో పోరుతో..

ఇంగ్లండ్‌లో టీమిండియా యంగెస్ట్‌ కెప్టెన్లు వీరే..
🏏శుబ్‌మన్‌ గిల్‌- 25 ఏళ్ల 285 రోజుల వయసులో- 2025లో లీడ్స్‌ వేదికగా..
🏏మన్సూర్‌ అలీ ఖాన్‌  పటౌడీ- 26 ఏళ్ల 154 రోజుల వయసులో- 1967లో లీడ్స్‌ వేదికగా..
🏏కపిల్‌ దేవ్‌- 27 ఏళ్ల 150 రోజుల వయసులో- 1986లో లార్డ్స్‌ వేదికగా..
🏏మహ్మద్‌ అజారుద్దీన్‌- 27 ఏళ్ల 168 రోజుల వయసులో- 1990లో లార్డ్స్‌ వేదికగా..
🏏జస్‌ప్రీత్‌ బుమ్రా- 27 ఏళ్ల 178 రోజుల వయసులో- 2022లో ఇంగ్లండ్‌ వేదికగా..

👉 ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో లంచ్‌ బ్రేక్‌ సమయానికి టీమిండియా స్కోరు: 92/2. ఓపెనర్లలో కేఎల్‌ రాహుల్‌ 42 పరుగులకు అవుట్‌ కాగా.. మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ 42 పరుగుల వద్ద ఉన్నాడు. అరంగేట్ర ఆటగాడు, వన్‌డౌన్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు.

చదవండి: IND vs ENG: పాపం నితీశ్‌ కుమార్‌.. అత‌డి కోసం ప‌క్క‌న పెట్టేశారు?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)