IND vs ENG: తొలి సెషన్‌ కీలకం.. ఆరు వికెట్లు తీసి..: ఇంగ్లండ్‌ కోచ్‌

Published on Mon, 07/14/2025 - 15:34

టీమిండియా- ఇంగ్లండ్‌ (IND vs ENG) మధ్య మూడో టెస్టు ముగింపు దశకు చేరుకుంది. సోమవారం నాటి ఆటలో పైచేయి సాధించిన జట్టునే విజయం వరించనుంది. భారత్‌ గెలుపొందాలంటే ఆఖరి రోజు 135 పరుగులు చేయాల్సి ఉండగా.. ఇంగ్లండ్‌కు ఆరు వికెట్లు తీయాల్సి ఉంది.

మొదటి గంట కీలకం
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ అసిస్టెంట్‌ కోచ్‌ మార్కస్‌ ట్రెస్కోతిక్‌ (Marcus Trescothick) టీమిండియాకు హెచ్చరికలు జారీ చేశాడు. ‘‘నాలుగోరోజు ఆట ఆఖర్లో మా వాళ్లు అద్భుతం చేశారు. ప్రేక్షకుల నుంచి కూడా మాకు విశేషమైన స్పందన లభించింది. వారి కేరింతలు మా వాళ్ల ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి.

ఆరు వికెట్లు పడగొడతాం
రేపు (సోమవారం) మొదటి గంట కీలకం. అప్పుడు టీమిండియా ఏమేరకు ఆధిపత్యం కొనసాగిస్తుందో.. ఏ మేర సానుకూల దృక్పథంతో ఉంటుందో చూడాలి. ఫస్ట్‌ అవర్‌లో మేమైతే మిగిలిన ఆ ఆరు వికెట్లు కూలుస్తామనే నమ్మకం ఉంది’’ అంటూ మార్కస్‌ ధీమా వ్యక్తం చేశాడు. ఆదివారం నాటి ఆట పూర్తయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

కాగా భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో జరుగుతోంది. ఇందులో భాగంగా లీడ్స్‌లో ఇంగ్లండ్‌ గెలవగా.. ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించింది. దీంతో సిరీస్‌ ప్రస్తుతం 1-1తో సమంగా ఉండగా.. లార్డ్స్‌లో మూడో టెస్టు జరుగుతోంది.

387- 387
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి.. 387 పరుగులకు ఆలౌట్‌ అయింది. జో రూట్‌ (104) సెంచరీతో సత్తా చాటగా.. జేమీ స్మిత్‌ (51), బ్రైడన్‌ కార్స్‌ (56) అర్ధ శతకాలతో సత్తా చాటారు.  భారత బౌలర్లలో జస్‌ప్రీత్‌ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. సిరాజ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి చెరో మూడు వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజాకు ఒక వికెట్‌ దక్కింది.

అనంతరం తమ మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా కూడా సరిగ్గా 387 పరుగులకే ఆలౌట్‌ అయింది. కేఎల్‌ రాహుల్‌ (100) శతక్కొట్టగా.. రవీంద్ర జడేజా (74) హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌ మూడు, జోఫ్రా ఆర్చర్‌, బెన్‌ స్టోక్స్‌ చెరో రెండు, బ్రైడన్‌ కార్స్‌, షోయబ్‌ బషీర్‌ ఒక్కో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 192 పరుగులకే కుప్పకూలింది. వాషింగ్టన్‌ సుందర్‌ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. బుమ్రా, సిరాజ్‌ రెండేసి వికెట్లు కూల్చారు. నితీశ్‌ రెడ్డి, ఆకాశ్‌ దీప్‌లు చెరో వికెట్‌ దక్కించుకున్నారు. ఇక ఇంగ్లండ్‌ విధించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు ఆదివారం నాలుగు వికెట్లు నష్టపోయి.. 58 పరుగులు చేసింది. 

చదవండి: IND vs ENG: సిరాజ్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)