గంభీర్ కొత్త ప్ర‌యోగం.. స్పిన్న‌ర్‌గా మారిన హార్దిక్ పాండ్యా!

Published on Fri, 07/26/2024 - 15:53

భార‌త్‌-శ్రీలంక మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు రంగం సిద్ద‌మైంది. జూలై 27న ప‌ల్లెకెలె వేదిక‌గా ఇరు జ‌ట్లు మ‌ధ్య జ‌ర‌గ‌నున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు ఉవ్విళ్లురూతున్నాయి. 

తొలి టీ20 కోసం తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. అయితే భారత జట్టు మాత్రం కొత్త హెడ్‌కోచ్ గంభీర్ నేతృత్వంలో నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది. గంటల సమయం పాటు సూర్య అండ్ కో నెట్స్‌లో చెమటోడ్చారు. 

అయితే నెట్ ప్రాక్టీస్‌లో భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్పిన్నర్‌గా అవతరెమెత్తాడు. సాధ‌ర‌ణంగా మీడియం పేస‌ర్ బౌల‌ర్ అయిన పాండ్యా.. లెగ్ స్పిన్ బౌలింగ్ చేసి అంద‌ర‌ని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్నాయి. ఇది చూసిన నెటిజ‌న్లు గంభీర్ కొత్త ప్ర‌యోగం చేస్తున్నాడ‌ని కామెంట్లు చేస్తున్నారు. మ‌రి కొంతమంది భార‌త జ‌ట్టుకు కొత్త స్పిన్న‌ర్ వ‌చ్చాడ‌ని పోస్ట్‌లు పెడుతున్నారు.

కాగా పాండ్యా కేవ‌లం టీ20 సిరీస్‌కు మాత్ర‌మే అందుబాటులో ఉండ‌నున్నాడు. లంక‌తో వ‌న్డే సిరీస్‌కు వ్య‌క్తిగత కార‌ణాల వ‌ల్ల హార్దిక్ దూర‌మ‌య్యాడు. అదేవిధంగా పాండ్యాను కాద‌ని భార‌త టీ20 కెప్టెన్‌గా సూర్య‌కుమార్ యాద‌వ్‌ను బీసీసీఐ ఎంపిక చేసిన విష‌యం విధితమే. ఇక ప‌ర్య‌ట‌లో భాగంగా భార‌త్ లంక‌తో మూడు టీ20లు, మూడు వ‌న్డేల సిరీస్‌లో త‌ల‌ప‌డ‌నుంది.

భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, రిషబ్‌ పంత్, రింకూ సింగ్‌, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్‌ దూబే, అక్షర్ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌, ఖలీల్ అహ్మద్‌, మహ్మద్‌ సిరాజ్

భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్ (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్, రిషబ్‌ పంత్, శివమ్‌ దూబే, కుల్దీప్ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్, వాషింగ్టన్‌ సుందర్, అర్ష్‌దీప్ సింగ్‌, రియాన్ పరాగ్‌, అక్షర్‌ పటేల్‌, ఖలీల్ అహ్మద్‌, హర్షిత్ రాణా.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)