Breaking News

టీమిండియా కొంప‌ముంచిన గంభీర్‌.. నెటిజ‌న్లు ఫైర్

Published on Mon, 02/23/2026 - 01:10

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో టీమిండియాకు ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రిగిన సూప‌ర్-8 మ్యాచ్‌లో 74 ప‌రుగుల తేడాతో భార‌త్ ఓట‌మి పాలైంది. ఈ మ్యాచ్‌లో భార‌త బ్యాటింగ్‌, బౌలింగ్ రెండింటిలోనూ విఫ‌ల‌మైంది.

188 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని చేధించ‌లేక టీమిండియా చతిక‌ల‌ప‌డింది. అయితే టీమ్‌మెనెజ్‌మెంట్ చేసిన కొన్ని త‌ప్పిదాలు కూడా మెన్ ఇన్ బ్లూ ఓట‌మికి కార‌ణ‌మ‌మ్యాయి. ముఖ్యంగా వైస్ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ స్ధానంలో వాషింగ్ట‌న్ సుంద‌ర్‌ని ఆడించి భార‌త మెనెజ్‌మెంట్ ఘోర త‌ప్పిదం చేసింది.

అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అక్షర్‌కు నెద‌ర్లాండ్స్‌తో జ‌రిగిన చివ‌రి లీగ్ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. అత‌డి స్దానంలో సుంద‌ర్‌ను తుది జ‌ట్టులో ఆడించారు. అయితే స‌ఫారీల‌తో సూప‌ర్-8 మ్యాచ్‌కు అక్ష‌ర్ తిరిగి అందుబాటులోకి వస్తాడ‌ని అంతా భావించారు. కానీ అక్ష‌ర్‌ను బెంచ్‌కే ప‌రిమితం చేస్తూ హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు.

టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఇది కేవలంవ్యూహాత్మక నిర్ణయం మాత్ర‌మేని చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికా టాప్-5లో ముగ్గురు ఎడమచేతి బ్యాట‌ర్లు ఉండ‌డంతో,  లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ కంటే ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ వుంటే బాగుంటుంద‌ని మేనేజ్‌మెంట్ భావించింది. 

కానీ మెనెజ్‌మెంట్ వ్యూహం బెడిసికొట్టింది. ప‌వ‌ర్‌ప్లేలో సుంద‌ర్‌తో ఒక్క ఓవ‌ర్ కూడా బౌలింగ్ చేయింలేదు.కెప్టెన్ అత‌డిని ఏడో ఓవర్లో ఎటాక్‌లోకి తీసుకొచ్చాడు. అలా అనీ నాలుగు ఓవ‌ర్ల కోటా కూడా పూర్తి చేయించ‌లేదు. సుంద‌ర్ రెండు ఓవ‌ర్లు వేసి 17 ప‌రుగులు ఇచ్చాడు. 

బ్యాటింగ్‌లో కూడా సుంద‌ర్ అట్ట‌ర్ ప్లాప్ అయ్యాడు. 11 బంతుల్లో 11 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. దీంతో గంభీర్‌పై నెటిజ‌న్లు ఫైర‌వ‌తున్నారు. "కేవలం 'మ్యాచ్-అప్'ల కోసం ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌ను తప్పించడం ఎంతవరకు సమంజసం?" అని గంభీర్‌ను ప్రశ్నిస్తున్నారు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)