Breaking News

కోహ్లి, రోహిత్‌లకు షాకిచ్చిన గౌతమ్‌ గంభీర్‌!

Published on Sun, 12/07/2025 - 18:41

వన్డే ప్రపంచకప్‌-2027లో టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆడుతురా? అంటే అవునానే స‌మాధాన‌మే ఎక్కువ‌గా వినిపిస్తోంది. ఎందుకంటే ఈ సీనియ‌ర్ క్రికెట‌ర్లు ఇద్దరూ ప్ర‌స్తుతం అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నారు. స్వ‌దేశంలో ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మూడు వ‌న్డేల సిరీస్‌లో రో-కో అద‌ర‌గొట్టారు.

కోహ్లి రెండు సెంచరీలతో స‌త్తాచాటి ప్లేయ‌ర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిల‌వ‌గా.. రోహిత్ కూడా ప‌రుగులు వ‌ర‌ద పారించాడు. ప్ర‌స్తుతం ఒకే ఫార్మాట్‌లో ఆడుతున్నప్పటికి మిగితా క్రికెటర్ల కంటే చాలా యాక్టివ్‌గా, ఫిట్‌గా ఉన్నారు. వారి వయస్సు వారి జోరుకు అడ్డు కావడం లేదు.

భారత క్రికెట్‌కే కాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లుగా కొనసాగుతున్నారు. దీంతో రో-కో వన్డే ప్రపంచకప్‌లో కచ్చితంగా ఆడుతారని అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే ప్రపంచకప్ ప్రణాళికలలో రోహిత్‌-కోహ్లి ఉన్నారా లేదా అన్నది భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు.

వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డే అనంతరం రోహిత్‌, కోహ్లిల భవిష్యత్తుపై గంభీర్‌ను విలేకరులు ప్రశ్నించారు. "రోహిత్, కోహ్లిలు ప్రపంచ స్థాయి ఆటగాళ్లు. డ్రెస్సింగ్ రూమ్‌లో వారి అనుభవం చాలా ముఖ్యం. వారిద్దరూ భారత్ తరపున చాలా కాలంగా ఇలాంటి ప్రదర్శనలే చేస్తున్నారు.

రాబోయో రోజుల్లో కూడా తమ ఫామ్‌ను కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. ఇది 50 ఓవర్ల ఫార్మాట్‌లో చాలా ముఖ్యం. అయితే వన్డే ప్రపంచకప్‌కు ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉంది. మనం వర్తమానంలో ఉండటం ముఖ్యం. జట్టులోకి వచ్చే యువ ఆటగాళ్లు తమ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి" అని గంభీర్ పేర్కొన్నాడు.
చదవండి: సూర్యను కెప్టెన్‌గా తీసేయండి..! అతడే సరైనోడు: గంగూలీ

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)