Breaking News

కోహ్లి స్టైల్లో సిక్స్ కొట్టిన సంజూ.. గంభీర్ రియాక్ష‌న్ వైర‌ల్‌

Published on Thu, 02/26/2026 - 20:23

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్ మ‌రోసారి త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగ‌ప‌రుచుకోలేక‌పోయాడు. చెన్నై వేదిక‌గా జింబాబ్వేతో జ‌రుగుతున్న సూప‌ర్-8 మ్యాచ్‌లో శాంస‌న్‌కు తుది జ‌ట్టులో ద‌క్కింది.

టీమ్ మెనెజ్‌మెంట్ అత‌డిని ఓపెన‌ర్‌గా పంపింది. అయితే సంజూ క్రీజులో  ఉన్నంత సేపు దూకుడుగా ఆడాడు. 15 బంతుల్లో 1 ఫోరు, 2 సిక్స్‌ల‌తో 24 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. అయితే  భార‌త స్కోరు బోర్డు ఖాతాను సంజూ భారీ సిక్స‌ర్‌తో తెరిచాడు. 

ఇన్నింగ్స్ రెండో బంతికే రిచర్డ్ నగరవ బౌలింగ్‌లో లాంగ్ ఆన్ మీదుగా శాంసన్ ఒక అద్భుతమైన సిక్సర్ బాదాడు. ఆ షాట్‌కు మైదానంలో ఉన్న ప్ర‌తీ ఒక్క‌రూ ఫిదా అయిపోయారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఈ షాట్‌ను చూసి ఆశ్చర్యపోయాడు. 

ఈ షాట్ 2022 టీ20 ప్రపంచకప్‌లో హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ కొట్టిన ఐకానిక్ సిక్సర్‌ను గుర్తుకు తెచ్చిందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో భార‌త్ భారీ స్కోర్ దిశ‌గా దూసుకుపోతుంది. 14 ఓవ‌ర్లు ముగిసే స‌రికి టీమిండియా 3 వికెట్ల న‌ష్టానికి 161 ప‌రుగులు చేసింది.


 

 

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)