Breaking News

సంతోషంగా ఉన్నాను.. మా ఓటమికి కారణం వారే: గంభీర్‌

Published on Sun, 11/16/2025 - 16:24

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్టు ఫలితం కేవలం రెండున్నర రోజుల్లోనే తేలిపోయింది. ఈ మ్యాచ్‌లో 30 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. టీమిండియా 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక ఘోర పరభావాన్ని మూటకట్టుకుంది.

పిచ్  పూర్తిగా బౌలర్లకు సహకరించడంతో భారత బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. ఒక్క వాషింగ్టన్ సుందర్(92 బంతుల్లో 31) మినహా మిగితా ఏ ప్లేయర్ కూడా క్రీజులో నిలదొక్కకోలేకపోయారు. తొలి రోజు మొదటి సెషన్‌ నుంచే పిచ్‌పై బౌన్స్ కనిపించింది. ఆ తర్వాత రెండో రోజు ఆటలో పిచ్‌పై పగుళ్లు ఏర్పడి, స్పిన్నర్లకు అనుకూలంగా మారింది.

 దీంతో స్పిన్నర్లు  బంతి గింగిరాలు తప్పారు. సౌతాఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ నాలుగు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. అతడితో పాటు కేశవ్ మహారాజ్ రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు సఫారీల రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా సైతం నాలుగు వికెట్లు సాధించాడు. ఈ మొదటి టెస్టులో నాలుగు ఇన్నింగ్స్‌లు కలిపి 594 పరుగులు మాత్రమే నమోదయ్యాయి అంటే పిచ్ ఎలా ఉందో ఆర్ధం చేసుకోవచ్చు.

ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై సర్వాత్ర విమర్శల వర్షం కురిపిస్తోంది.  ఇటుంటి పిచ్‌ల వ‌ల్ల టెస్ట్ క్రికెట్ అంతరించిపోతుందని మాజీ భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ మండిప‌డ్డాడు. కాగా ఈ పిచ్‌ను భార‌త హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ సూచన మేరకే ఈడెన్ గార్డెన్స్ క్యూరేట‌ర్‌  తాయారు చేశాడు. దీంతో గంభీర్‌ను కూడా నెటిజ‌న్లు టార్గెట్ చేశాడు. సోష‌ల్ మీడియాలో గంభీర్‌ను ట్రోల్ చేస్తున్నారు. కోచ్‌గా అత‌డిని తీసేయండి కామెంట్స్ చేస్తున్నారు.

బ్యాటర్లే కొంప ముంచారు..
ఇక ఈ ఘోర ఓట‌మిపై మ్యాచ్ అనంత‌రం గంభీర్ స్పందించాడు. తామే ఇటువంటి పిచ్‌ను కోరుకున్న‌ట్లు గంభీర్ ధ్రువీక‌రించాడు. "మేము అడిగిన పిచ్‌ను తయారు చేసి ఇచ్చినందుకు సంతోషంగా ఉన్నాము. మేము ఎప్ప‌టి నుంచో ఇటువంటి పిచ్ కోసమే ఎదురు చూస్తున్నాము. క్యూరేట‌ర్ మాకు అన్ని విధాల స‌హ‌క‌రించారు. 

అయితే ఈ వికెట్‌పై మేము మెరుగైన బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోయాము. అందుకే ఓడిపోయాము. పిచ్‌లో ఎలాంటి భూతాలు లేవు. ఇదే వికెట్‌పై టెంబా బవుమా హాఫ్ సెంచరీ సాధించాడు. అక్షర్, వాషింగ్టన్ కూడా రన్స్ చేశారు. కాబట్టి ఇక్క పిచ్ సమస్య కాదు. 

ఎక్కువ వికెట్లు ఫాస్ట్ బౌలర్లకే వచ్చాయి. కాబట్టి ఇది బ్యాటింగ్‌కు మరి అంత కష్టమైన వికెట్ కాదు. ఇటువంటి పిచ్‌లు మీ టెక్నిక్‌, స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తాయి. మంచి డిఫెన్స్ టెక్నిక్‌ ఉంటే, ఇలాంటి వికెట్‌పై కూడా ప‌రుగులు సాధించ‌వ‌చ్చు" అని పోస్ట్ మ్యాచ్‌ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంభీర్ పేర్కొన్నాడు.

సంక్షిప్త స్కోర్లు
సౌతాఫ్రికా- 159 &153
భారత్‌- 189 &93.
చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. మా ఓటమికి కారణం అదే: పంత్‌

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)