Breaking News

ఏం జరిగిందో చూశారు కదా.. నోరుపారేసుకోవడం ఆపితే మంచిది: రోహిత్‌

Published on Fri, 01/05/2024 - 07:17

2024 ఏడాదిని విజయంతో టీమిండియా ఆరంభించింది. కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టు కేవలం ఒకటిన్నర రోజుల్లోనే ఈ మ్యాచ్‌ను ముగించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

79 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌కు వేదికైన కేప్‌టౌన్‌ పిచ్‌పై ప్రస్తుతం క్రికెట్‌ వర్గాలపై తెగ చర్చనడుస్తోంది. ఈ పిచ్‌పై పేసర్లు అద్బుతాలు సృష్టించారు. ఒకటిన్నర రోజుల్లోనే 33 వికెట్లు నేలకూలాయి. 

టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో బంతుల పరంగా అత్యంత వేగంగా ముగిసిన మ్యాచ్‌గా కేప్‌టౌన్‌ టెస్టు రికార్డులకెక్కింది.  మ్యాచ్‌ అనంతరం ఇదే విషయంపై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. భారత్‌ పిచ్‌లపై విమర్శలు చేసే వారికి రోహిత్‌ గట్టి కౌంటరిచ్చాడు.

"ఇది కూడా క్రికెట్‌ పిచే కదా. ఆడింది మ్యాచే కదా! మ్యాచ్‌ రిఫరీలకు, ఐసీసీకి ఏం జరిగిందొ కనబడిందనే అనుకుంటున్నా. మరి దీనికేం రేటింగ్‌ ఇస్తారు? భారత్‌లో ప్రపంచకప్‌ ఫైనల్‌ కోసం తయారు చేసిన పిచ్‌పై ఓ బ్యాటర్‌ సెంచరీ చేసినా దానికి ‘యావరేజ్‌’ రేటింగ్‌ ఇస్తారు. ఇవేం ద్వంద్వ ప్రమాణాలు మరి! ఐసీసీ గానీ, రిఫరీలు గానీ తటస్థంగా ఉండాలి.

కేప్‌టౌన్‌లో ఏం జరిగిందో అందరూ చూశారు. పిచ్‌ ఎలా ఉందో అందరికీ తెలుసు. నిజాయితీగా చెబుతున్నా... ఇలాంటి పిచ్‌లపై ఆడేందుకు నాకైతే ఎలాంటి ఇబ్బందులు లేవు. అలాగే విదేశీ జట్లు కూడా భారత్‌కు వచ్చినప్పుడు మూడు రోజుల్లో ముగిస్తే, స్పిన్‌ తిరిగితే ఇవేం పిచ్‌లు, ఇదేం చెత్త అని నోరుపారేసుకోవడం ఆపితే మంచిది" అని పోస్ట్‌మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో రోహిత్‌ పేర్కొన్నాడు.
చదవండి: Ind vs SA: దెబ్బకు దెబ్బ: రెండు రోజుల్లోనే ముగించిన టీమిండియా.. సరికొత్త చరిత్ర

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)