Breaking News

WPL 2023: క్రికెటర్‌పై వేటు.. ఆరంభంలోనే వివాదం

Published on Sat, 03/04/2023 - 19:20

బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌(WPL 2023) ఆరంభ సీజన్‌ తొలిరోజునే వివాదం నెలకొంది. గుజరాత్‌ జెయింట్స్‌ జట్టు ఫిట్‌నెస్‌ లేదన్న కారణంగా విండీస్‌ ఆల్‌రౌండర్‌ డియాండ్రా డాటిన్‌పై వేటు వేసింది. ఈ విషయం పెద్ద వివాదంగా మారింది. ఫిట్‌నెస్‌ లేదని చెప్పి తనను అకారణంగా డబ్ల్యూపీఎల్‌ నుంచి తప్పించారంటూ విండీస్‌ మహిళా క్రికెటర్‌ డియాండ్రా డాటిన్‌ ఆరోపణలు చేసింది. త‌న ప్లేస్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ కింబెర్లీ గార్త్‌ను తీసుకోవ‌డం స‌రికాద‌ని ఆమె తెలిపింది.

''తొంద‌ర‌గా కోలుకోవాల‌ని నాకు మెసేజ్‌లు పంపిస్తున్నవాళ్లను అభినందిస్తున్నా. అయితే.. నిజం ఏంటంటే..? నేను ఎలాంటి గాయం నుంచి కోలుకోవ‌డం లేదు. ధ‌న్యవాదాలు'' అని సోష‌ల్‌మీడియాలో పోస్ట్‌లో రాసుకొచ్చింది. చికిత్స తీసుకున్న డాటిన్ ఇంకా కోలుకోలేద‌ని చెప్పి గుజరాత్ జెయింట్స్ డాటిన్‌ను త‌ప్పించింది. డ‌బ్ల్యూపీఎల్ వేలంలో రూ.50 లక్షల క‌నీస ధ‌ర ఉన్న డాటిన్‌ను గుజరాత్ జెయింట్స్ రూ. 60 ల‌క్షల‌కు కొనుగోలు చేసింది.

ఈ మ‌ధ్యే ముగిసిన‌ వేలంలో కింబెర్లీ గార్త్‌ను ఏ జ‌ట్టు కొనేందుకు ఆస‌క్తి చూపించ‌లేదు. ద‌క్షిణాఫ్రికాలో ముగిసిన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన ఆసీస్ జ‌ట్టులో గార్త్ స‌భ్యురాలు. అయితే.. ఈమె కేవ‌లం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. వుమెన్స్‌ ప్రీమియ‌ర్ లీగ్ ఇవాళ(మార్చి 4న) ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఆరంభ పోరులో బేత్ మూనీ సార‌థ్యంలోని గుజ‌రాత్ జెయింట్స్‌, హ‌ర్మన్‌ప్రీత్ కౌర్ సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి.

చదవండి: WPL 2023: మ్యాచ్‌ 30 నిమిషాలు ఆలస్యంగా..

మహిళల ఐపీఎల్‌ 2023.. తొలి మ్యాచ్‌లో గెలుపెవరిది..?

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు