Breaking News

నేడు జపాన్‌పై గెలిస్తేనే భారత జట్టుకు ‘పారిస్‌’ బెర్త్‌

Published on Fri, 01/19/2024 - 02:41

రాంచీ: మహిళల హాకీ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ సెమీఫైనల్లో భారత జట్టుకు ఓటమి ఎదురైంది. జర్మనీతో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా ‘షూటౌట్‌’లో 3–4 గోల్స్‌ తేడాతో ఓడిపోయింది. ఈ గెలుపుతో జర్మనీ పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. తొలి సెమీఫైనల్లో అమెరికా 2–1తో జపాన్‌ను ఓడించి పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మూడో బెర్త్‌ కోసం నేడు భారత్, జపాన్‌ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తుంది.

జర్మనీతో జరిగిన సెమీఫైనల్లో నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. భారత్‌ తరఫున దీపిక (15వ ని.లో), ఇషిక (59వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. జర్మనీ జట్టుకు చార్లోటి (27వ, 57వ ని.లో) రెండు గోల్స్‌ అందించింది. ‘షూటౌట్‌’లో తొలి ఐదు షాట్‌లు ముగిశాక రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. ఫలితం తేలడానికి ‘సడెన్‌డెత్‌’ను నిర్వహించగా... తొలి ప్రయత్నంలో రెండు జట్లు విఫలమయ్యాయి. రెండో ప్రయత్నంలో భారత ప్లేయర్‌ సంగీత గురి తప్పగా... జర్మనీ ప్లేయర్‌ లీసా నోల్టి గోల్‌ చేసి జర్మనీ విజయాన్ని ఖరారు చేసింది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)