Breaking News

Rachin Ravindra: నేను వంద శాతం న్యూజిలాండ్‌వాడినే.. కానీ

Published on Tue, 11/05/2024 - 04:03

ముంబై: భారత్‌తో టెస్టు సిరీస్‌ విజయంలో న్యూజిలాండ్‌ బ్యాటర్‌ రచిన్‌ రవీంద్ర కూడా ప్రధాన పాత్ర పోషించాడు. తన తల్లిదండ్రులు పుట్టి పెరిగిన బెంగళూరులో అద్భుత సెంచరీ సాధించి జట్టును తొలి టెస్టులో గెలిపించిన అతను సిరీస్‌ విజయానికి పునాది వేశాడు. అయితే ఇన్నేళ్లలో ఎన్నడూ లేనిది సిరీస్‌ విజయం తర్వాత తన తండ్రి అభినందిస్తూ మెసేజ్‌ పంపించడం తన ఆనందాన్ని రెట్టింపు చేసిందని రచిన్‌ చెప్పాడు. 

నేను వంద శాతం న్యూజిలాండ్‌వాడినే
చిన్నస్వామి స్టేడియంలో ప్రేక్షకుల మధ్య ఉన్న తండ్రి రవి కృష్ణమూర్తి సమక్షంలోనే రచిన్‌ శతకంతో సత్తా చాటాడు. ‘నేను వంద శాతం న్యూజిలాండ్‌వాడినే. అక్కడే పుట్టి పెరిగాను. 

కానీ మా అమ్మా నాన్న సొంత ఊరిలో నేను బాగా ఆడటం మరచిపోలేని క్షణం. అది ఎప్పటికీ గుర్తుకు వస్తూనే ఉంటుంది. అయితే ఇన్నేళ్లలో ఆయన నన్ను వ్యక్తిగతంగా అభినందించడం ఎప్పుడూ చూడలేదు. 

కానీ ముంబై టెస్టు తర్వాత నిన్ను చూసి గర్విస్తున్నా అని నాన్న మెసేజ్‌ పంపించారు. అందుకే ఈ సిరీస్‌ విజయానందం రెట్టింపైంది. గెలిచాక మైదానంలో కూడా మా పరిస్థితి అంతా కొత్తగా, నమ్మశక్యం కాని విధంగా ఉంది. 

ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను
ఎజాజ్‌ చివరి వికెట్‌ తీయగానే ప్రతీ ఒక్కరూ ఆనందంతో సహచరుల వైపు పరుగెడుతున్నారు. ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురు కాలేదు. అందరం ఒక్కచోట చేరి ఆనందం పంచుకున్న అనుభూతిని నిజంగా మాటల్లో వర్ణించలేను. కానీ ఎంతో ప్రత్యేకం అని మాత్రం చెప్పగలను’ అని రచిన్‌ వివరించాడు. 

చదవండి: Aus vs Pak: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా   

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)