బుమ్రాతో పోల్చడానికి సిగ్గుండాలి!

Published on Sat, 03/14/2026 - 19:02

పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) సెలెక్టర్‌ ఆకిబ్‌ జావేద్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను పాక్‌ వివాదాస్పద బౌలర్‌ ఉస్మాన్‌ తారిఖ్‌తో పోల్చడం క్రికెట్‌లో చర్చనీయాంశంగా మారింది. శనివారం మీడియా సమావేశంలో ఆకిబ్‌ జావేద్‌ మాట్లాడుతూ.. ‘నేటి తరంలో బుమ్రా ఒక అసాధారణ బౌలర్‌. అతని బౌలింగ్‌ యాక్షన్‌ కూడా భిన్నంగానే ఉంటుంది. 

బుమ్రా బౌలింగ్‌ చేయడానికి వచ్చినప్పుడల్లా మా పాక్‌ బౌలర్లలో ఉస్మాన్‌ తారిఖ్‌లాగే కనిపిస్తాడు. బుమ్రా వేగంతో బంతిని విసరడంలో దిట్ట అయినప్పటికీ అతని బౌలింగ్‌ శైలి ప్రత్యర్థి బ్యాటర్లను గందరగోళానికి గురి చేస్తుంది. స్మిన్నర్‌ తారిఖ్‌ కూడా బ్యాటర్లను తికమక పెట్టేందుకే బంతిని కాస్త ఆలస్యంగా విసురుతుంటాడు. ఈ టెక్నిక్‌ను ఉపయోగించే తారిఖ్‌ టీ20 ప్రపంచకప్‌లో 10వికెట్లు పడగొట్టాడు. 

ఇక టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా కాకుండా వేరే బౌలర్‌ ఎవరైనా మంచి ప్రదర్శన చేశారని చెప్పడం కష్టమే. ముఖ్యంగా టోర్నీ సెకండ్‌ హాఫ్‌లో భారీ స్కోర్లు నమోదైనప్పటికీ బుమ్రా మాత్రం తన వినూత్న బౌలింగ్‌తో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. అంతేకాదు బుమ్రా తన బౌలింగ్‌తో మేటి బౌలర్లు వసీమ్‌ అక్రమ్‌, వకార్‌ యూనిస్‌ల ప్రతిబింబాన్ని గుర్తుకు తెచ్చాడని చెప్పొచ్చు. ఇకపై బుమ్రా లాంటి బౌలర్‌ దొరకడు’ అని పేర్కొన్నాడు. 

కాగా ఆకిబ్‌ జావేద్‌ బుమ్రాను పొగడడం వరకు బాగానే ఉన్నప్పటికీ తన స్థాయికి ఏమాత్రం తూగని ఉస్మాన్‌ తారిఖ్‌తో పోల్చడమే క్రికెట్‌ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ‘బుమ్రాతో అతడికి పోలికేంటి?’, ‘బుమ్రా ఎక్కడ.. తారిఖ్‌ ఎక్కడ? స్థాయి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందేమో’, ‘బుమ్రా లాంటి నంబర్‌వన్‌ బౌలర్‌ను పెద్దగా గుర్తింపు లేని ప్లేయర్‌తో పోల్చడానికి సిగ్గు ఉండాలి’ అని కామెంట్లు చేశారు.

ఇక టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా స్పీడస్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా 14 వికెట్లు పడగొట్టి మరో భారత స్పిన్నర్‌ వరుణ్‌చక్రవర్తితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు వివాదాస్పద బౌలర్‌గా పేరు పొందిన ఉస్మాన్‌ తారిఖ్‌ టీ20 ప్రపంచకప్‌లో 10 వికెట్లు పడగొట్టాడు.

చదవండి: ముమ్మాటికీ అఘాదే తప్పు.. ఐసీసీ సీరియస్‌

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)