Breaking News

పసికూనపై ప్రతాపం.. బోణీ కొట్టిన పాకిస్తాన్‌

Published on Wed, 11/19/2025 - 08:10

స్వదేశంలో జరుగుతున్న ముక్కోణపు టి20 టోర్నమెంట్‌ను పాకిస్తాన్‌ విజయంతో ప్రారంభించింది. పాకిస్తాన్, జింబాబ్వే, శ్రీలంక జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్‌ తొలి పోరులో ఆతిథ్య పాక్‌ బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన పోరులో పాకిస్తాన్‌ 5 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తుచేసింది.

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. బ్రియాన్‌ బెనెట్‌ (36 బంతుల్లో 49; 8 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా... కెప్టెన్‌ సికందర్‌ రజా (24 బంతుల్లో 34 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), మరుమని (22 బంతుల్లో 30; 3 ఫోర్లు; 1 సిక్స్‌) తలా కొన్ని పరుగులు చేశారు. 

పాకిస్తాన్‌ బౌలర్లలో మొహమ్మద్‌ నవాజ్‌ 2 వికెట్లు పడగొట్టగా... షాహీన్‌ షా, సల్మాన్‌ మీర్జా, సయీమ్‌ అయూబ్, అబ్రార్‌ అహ్మద్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్‌ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 151 పరుగులు చేసి విజయం సాధించింది. 

ఫఖర్‌ జమాన్‌ (32 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఉస్మాన్‌ ఖాన్‌ (28 బంతుల్లో 37 నాటౌట్‌; 3 ఫోర్లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ మొహమ్మద్‌ నవాజ్‌ (12 బంతుల్లో 21 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌), సయీమ్‌ అయూబ్‌ (22; 1 ఫోర్, 1 సిక్స్‌) తలా కొన్ని పరుగులు చేశారు. కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా (1), మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (0) విఫలమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్‌ ఇవాన్స్‌ 2 వికెట్లు పడగొట్టాడు. ముక్కోణపు టోర్నీలో భాగంగా గురువారం శ్రీలంకతో జింబాబ్వే తలపడనుంది.
చదవండి: వైభవ్‌ సూర్యవంశీ ఫెయిల్‌.. అయినా సెమీస్‌కు భారత్‌

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)