Breaking News

T20 WC: ఐసీసీ మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు

Published on Mon, 02/02/2026 - 19:36

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌ ఆరంభానికి ముందే వివాదాలు మొదలయ్యాయి. శ్రీలంకతో కలిసి భారత్‌ ఆతిథ్యం ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తుండగా.. బంగ్లాదేశ్‌- పాకిస్తాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC)కి తలనొప్పిగా మారాయి.

ఇందుకు కారణం.. భారత్‌- బంగ్లాదేశ్‌ (IND vs BAN), భారత్- పాకిస్తాన్‌ (IND vs PAK) దౌత్య సంబంధాలలో ఉద్రిక్తతలు... పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్‌ పాక్‌తో మెగా ఈవెంట్లలో తలపడే విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తోంది. 

మరోవైపు.. ఇన్నాళ్లు భారత్‌ సాయం పొందిన బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై దాడులతో పాటు భారత్‌ గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నాయకుల సంఖ్య పెరిగిపోయింది.

అప్పుడు మొదలు
ఈ పరిణామాల నేపథ్యంలో ఐపీఎల్‌ నుంచి బంగ్లాదేశ్‌ ఫాస్ట్‌బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను తొలగించాలనే డిమాండ్లు పెరరగా.. బీసీసీఐ అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు కూడా! 

అంతేకాదు.. టీమిండియా బంగ్లాదేశ్‌ పర్యటనను కూడా నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ క్రమంలో భారత్‌లో తమకు భద్రత లేదంటూ.. తమ మ్యాచ్‌ల వేదికను శ్రీలంకకు మార్చాల్సిందిగా బంగ్లా పట్టుబట్టింది. అయితే, ఐసీసీ ఇందుకు నిరాకరించి.. గడువు ఇచ్చినా పంతం వీడకపోవడంతో బంగ్లాను తప్పించింది. ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది.

బంగ్లాకు మద్దతుగా పాక్‌
ఇక ఆ తర్వాత బంగ్లాకు మద్దతుగా తామూ టోర్నీని బహిష్కరిస్తామని బీరాలు పలికిన పాకిస్తాన్‌.. ఇప్పుడు కేవలం భారత్‌తో మ్యాచ్‌ ఆడబోమంటూ ప్రకటించింది. అయితే, ఇందుకు సంబంధించి ఐసీసీకి అధికారికంగా మెయల్‌ చేయలేదు. ఈ పరిణామాలపై ఐసీసీ కమ్యూనికేషన్స్‌ మాజీ హెడ్‌ సమీ ఉల్‌ హసన్‌ బర్నే స్పందిస్తూ.. తప్పంతా బీసీసీఐపైకి నెట్టాడు.

బీసీసీఐ నిందలు
‘‘ఈ విషయంలో క్రికెట్‌ బోర్డులు మరింత ఆచితూచి వ్యవహరించాల్సింది. ముఖ్యంగా ముస్తాఫిజుర్‌ను తొలగించిన విషయాన్ని బీసీసీఐ బహిరంగంగా చెప్పకుండా ఉండాల్సింది. కేకేఆర్‌కు ప్రైవేటుగా విషయం చెప్పి అతడిని రిలీజ్‌ చేయమని చెప్పాల్సింది.

కొన్నిసార్లు ఇలాంటి చిన్న విషయాలే పెద్దగా మారతాయి. జనవరి 3న వాళ్లు (బీసీసీఐ) చేసిన ప్రకటనే వీటన్నిటికీ మూలం. అయితే, బంగ్లాదేశ్‌ విషయంలో పాక్‌ చేస్తున్న పోరాటం సరైంది కావచు​... కాకపోనూ వచ్చు. ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగానే ఏ బోర్డు అయినా నడుచుకుంటుంది.

ఏదేమైనా పాక్‌ తదుపరి పరిణామాలకు సిద్ధపడే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటుంది. న్యాయ బృందంతో చర్చించి.. ఈ విషయంపై ఎలా ముందుకు సాగాలో వారు ఆలోచించుకునే ఉంటారు’’ అని సమీ ఉల్‌ హసన్‌ బర్నే పేర్కొన్నాడు. 

కాగా పాక్‌ కోసం శ్రీలంకను ఐసీసీ తటస్థ వేదికగా ఏర్పాటు చేసినప్పటికీ.. భద్రతా కారణాలు అంటూ పాక్‌ భారత్‌ మ్యాచ్‌ను బహిష్కరిస్తామనడం గమనార్హం. అందుకే ఐసీసీ ఈసారి పాక్‌కు గట్టిగానే బుద్ధి చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

చదవండి: పాక్‌ ఓవరాక్షన్‌.. ఐసీసీ కీలక సమావేశం!

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)