Breaking News

నేరాన్ని అంగీక‌రించిన వార్న‌ర్‌.. ఆగ‌స్టు 18న తుది తీర్పు!

Published on Wed, 07/22/2026 - 11:14

ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ జైలుకు వెళ్లే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. త‌ప్ప తాగి వాహ‌నం న‌డిపిన‌ట్లు వార్న‌ర్ త‌ర‌ఫు లాయ‌ర్ బుధ‌వారం కోర్టు ఎదుట అంగీక‌రించాడు. దీంతో ఆగ‌స్టు 18న వార్న‌ర్‌కు కోర్టు శిక్ష ఖ‌రారు చేయ‌నుంది.  విష‌యంలోకి వెళితే.. కొన్ని నెలల క్రితం ఈస్టర్‌ సండే రోజున వార్నర్ తన కారును వేగంగా నడుపుకుంటూ వచ్చాడు. అయితే దారిలో పోలీసులు ఏర్పాటు చేసిన ర్యాండమ్ టెస్టింగ్ సైట్‌కు కొద్ది దూరంలోనే తన వాహనాన్ని ఆపాడు. 

వార్నర్‌పై అనుమానంతో పోలీసులు అత‌నికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించగా, పరిమితికి మించి మద్యం సేవించినట్టు తేలింది. దీంతో వార్న‌ర్‌ను అదుపులోకి తీసుకొని ద‌గ్గ‌ర్లోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా ఈ కేసు విచార‌ణ కోర్టుకు రాగా, వార్న‌ర్ వ్య‌క్తిగ‌తంగా హాజ‌రు కాలేక‌పోయాడు. 

అయితే వార్న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది బాబీ హిల్ కోర్టుకు హాజ‌ర‌య్యాడు. వార్న‌ర్ ‘మిడ్ రేంజ్‌’లో డ్రింక్ చేశాడ‌ని కోర్టుకు వివ‌రించాడు. అనంత‌రం వార్న‌ర్ త‌న నేరాన్ని అంగీక‌రిస్తున్న‌ట్లు కూడా అత‌ని త‌ర‌ఫు లాయ‌ర్ కోర్ట‌కు తెలిపాడు.  ‘చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. వాటికి బాధ్యత వహించడం ముఖ్యం. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అయినా సరే, ఈ ప్రమాదం ఎవరికైనా పొంచి ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. 

లాయ‌ర్ వాద‌న‌లు విన్న కోర్టు  ఆగ‌స్టు 18న తీర్పు వెల్ల‌డించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. వార్న‌ర్ త‌న నేరాన్ని ఒప్పుకోవ‌డంతో గ‌రిష్టంగా 9 నెల‌ల జైలు శిక్ష‌తో పాటు 2200 ఆస్ట్రేలియ‌న్ డాల‌ర్లు (భార‌త క‌రెన్సీలో సుమారు రూ. లక్ష 48 వేలు) జ‌రిమానా ప‌డ‌నుంది. అంతేకాదు ర్యాష్ డ్రైవింగ్ కార‌ణంగా లైసెన్స్‌ను హోల్డ్‌లో పెట్టి ఆరు నెల‌ల పాటు డ్రైవింగ్ కూడా దూరంగా ఉండాల‌ని తీర్పులో వెల్ల‌డించే అవ‌కాశ‌ముంది.

Read: అర్జెంటీనా చీటింగ్‌.. కాక రేపుతున్న రొనాల్డో 'లైక్' వివాదం

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)