Breaking News

సెమీస్ స‌మ‌రం.. స్పెయిన్‌తో ఫ్రాన్స్ ఢీ! ఫైనల్‌ బెర్త్‌ ఎవరిదో?

Published on Tue, 07/09/2024 - 13:51

‘యూరో’ కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ-2024 తొలి సెమీఫైన‌ల్‌కు స‌ర్వం సిద్ద‌మైంది. మంగ‌ళ‌వారం  అలియాంజ్ ఎరీనా వేదిక‌గా జ‌ర‌గ‌నున్న‌ సెమీఫైన‌ల్-1లో ఫ్రాన్స్‌, స్పెయిన్ జ‌ట్లు తాడో పేడో తెల్చుకోనున్నాయి. ఈ సెమీస్ పోరులో గెలిచి ఫైన‌ల్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాల‌ని ఇరు జ‌ట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.  

స్పెయిన్‌ ఫైనల్‌కు చేరుతుందా?
అయితే  ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి జోరు మీదున్న స్పెయిన్‌కు సెమీస్ ముందు గాయాలు, కార్డ్ సస్పెన్షన్‌ల బెడ‌ద వెంటాడుతోంది. ఇప్ప‌టికే కీల‌క మ్యాచ్‌కు ముందు  రాబిన్ లే నార్మాండ్, డాని కార్వాజల్ ఇద్దరూ సస్పెండ్ అయ్యారు. 

మ‌రోవైపు , యువ మిడ్‌ఫీల్డర్ పెడ్రీ టోని క్రూస్ గాయం కార‌ణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ క్ర‌మంలో డిఫెన్స్‌లో రాబిన్ లే నార్మాండ్, డాని కార్వాజల్ స్ధానాలను నాచో,  జీసస్ నెవాస్ భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అదేవిధంగా పెడ్రీ ప్రత్యామ్నాయంగా వచ్చిన  డాని ఓల్మో ప్లేయింగ్‌లో త‌న స్దానాన్ని సుస్థిరం చేసుకోనున్నాడు.

స్పెయిన్ జోరును ఫ్రాన్స్ అడ్డుకుంటుందా?
ఇక సెమీస్‌కు ముందు ఫ్రాన్స్ టీమ్‌లో ఎట‌వంటి గాయాలు,  కార్డ్ సస్పెన్షన్‌లు లేవు. జ‌ట్టు మొత్తం క్లియ‌ర్‌గా ఉంది. కానీ ఫ్రాన్స్ సెమీస్‌కు వ‌చ్చిన‌ప్ప‌టికి త‌మ స్ధాయికి తగ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేక‌పోయింది. గోల్స్ సాధించ‌డంలో ఫ్రాన్స్ త‌మ మార్క్ చూపించలేక‌పోయింది.

 కెప్టెన్ కైలియన్ ఎంబాపే గాయం కావ‌డం ఫ్రాన్స్‌ను కాస్త దెబ్బ‌తీసింది. అత‌డు తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చిన‌ప్ప‌టి మున‌ప‌టి జోరును ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోతున్నాడు. సెమీఫైన‌ల్లోనైనా ఎంబాపే స‌త్తాచాటుతాడో లేదో వేచి చూడాలి. కాగా సెమీఫైనల్‌ చేరే క్రమంలో స్పెయిన్‌ 11 గోల్స్‌ చేయగా... ఫ్రాన్స్ కేవ‌లం మూడు గోల్స్ మాత్ర‌మే  సాధించింది. 
 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)