Breaking News

హాలండ్‌ జోరు.. ఉత్కంఠ పోరులో నార్వే విజ‌యం

Published on Tue, 06/23/2026 - 08:35

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో నార్వే జ‌ట్టు రౌండ్ ఆఫ్ 32 ద‌శ‌కు అర్హ‌త సాధించింది. గ్రూప్‌-ఐలో భాగంగా మంగ‌ళ‌వారం సెనెగ‌ల్‌తో జ‌రిగిన ఉత్కంఠ పోరులో నార్వే 3-2తో విజ‌యాన్ని అందుకుంది. నార్వే త‌ర‌ఫున స్టార్ ఆట‌గాడు ఎర్లింగ్ హాలండ్ (ఆట 48, 58వ నిమిషం) డ‌బుల్ గోల్స్ కొట్ట‌గా, మార్క‌స్ పెడెర్స‌న్ (ఆట 43వ నిమిషం) మ‌రో గోల్ చేశాడు. అటు సెనెగ‌ల్ త‌ర‌ఫున ఇస్మాయిల్ సర్ (ఆట 53, 90+3వ నిమిషం) రెండు గోల్స్ కొట్టాడు. ఈ విజ‌యంతో నార్వే నాకౌట్ ద‌శ‌కు చేరుకోగా సెనెగ‌ల్ ఆడిన రెండింటిలో ఓడి ఇంటిబాట ప‌ట్టింది.

ఇక రెండు గోల్స్ సాధించిన ఎర్లింగ్ హాలండ్‌కు 52 అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల్లో 59 గోల్స్ కావ‌డం విశేషం. అంతేకాదు ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో వ‌రుస‌గా రెండు మ్యాచ్‌లు గెల‌వ‌డం నార్వేకు ఇదే తొలిసారి. కాగా లీగ్ ద‌శ‌లో నార్వే త‌న చివ‌రి మ్యాచ్‌ను ఫ్రాన్స్‌తో ఆడ‌నుంది.

నార్వే ‘వై కింగ్‌’ సెలబ్రేషన్‌
ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, ముఖ్యంగా ప్రపంచకప్ (World Cup) లాంటి మెగా టోర్నమెంట్లలో నార్వే దేశ ఫుట్‌బాల్ జట్టు, వారి అభిమానులు "వైకింగ్ రోయింగ్" (Viking rowing) అనే వినూత్నమైన సెలబ్రేషన్ చేసుకుంటారు. ఆటగాళ్లు లేదా అభిమానులు నేలపై వరుసగా కూర్చొని, తెడ్డు వేస్తున్నట్లు (rowing) హావభావాలు ప్రదర్శిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఇది వారి దేశ సంస్కృతికి ప్రతీక.

Read: వందో మ్యాచ్‌లో ఎంబాపె రికార్డు గోల్స్‌.. నాకౌట్‌కు ఫ్రాన్స్‌

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి