Breaking News

వ‌ర్షం కారణంగా తొలి టీ20 ర‌ద్దు.. భారత్‌కు అచ్చిరాని వేదిక

Published on Thu, 07/02/2026 - 00:58

చెస్ట‌ర్-లీ-స్ట్రీట్ వేదికగా ఇంగ్లండ్‌, భార‌త్ మ‌ధ్య జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌ను వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు చేస్తున్న‌ట్లు అంపైర్లు ప్ర‌క‌టించారు. టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన అనంత‌రం జోరందుకున్న వ‌ర్షం ఎంత‌కీ తెరిపినివ్వ‌క‌పోవ‌డంతో మ్యాచ్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు అంపైర్లు తెలిపారు. అయితే చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా భారత్ ఆడిన మూడు మ్యాచ్‌లు కూడా వర్షం కారణంగా రద్దవ్వడం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. 

ఈ వేదిక టీమిండియాకు అంతగా కలసిరాలేదు. 2002లో తొలిసారి ఈ వేదికలో భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య జరిగిన వన్డే మ్యాచ్ వర్షార్ప ణమైంది. ఆ తర్వాత 2011లో మరోసారి ఇరుజట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యింది. తాజాగా మూడోసారి అదే ఫలితం పునరావృతం కావడం గమనార్హం. 

ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా  20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 189 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ (59), కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (47 బంతుల్లో 68) అర్ధ‌సెంచ‌రీల‌తో రాణించారు. ఆఖ‌ర్లో శివ‌మ్ దూబే  (21 బంతుల్లో 42 నాటౌట్‌) ప‌వ‌ర్‌హిట్టింగ్‌తో టీమిండియా భారీ స్కోరు చేయ‌గ‌లిగింది.  ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో సాకిబ్ మ‌హ్మూద్ 3 వికెట్లు తీయ‌గా, ఆదిల్ ర‌షీద్‌, సామ్ క‌ర‌న్‌లు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ మాంచెస్టర్ వేదికగా జరగనుంది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ త‌గిలింది. ఓపెనర్ సంజూ శాంస‌న్ ఒక్క ప‌రుగు చేసి ఔట‌య్యాడు. ఆ వెంట‌నే ఇషాన్ కిష‌న్ దుర‌దృష్ట‌వ‌శాత్తూ ర‌నౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో భార‌త్ 6 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో అభిషేక్‌, శ్రేయ‌స్‌లు క‌లిసి భార‌త ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దారు. ఈ ఇద్ద‌రు మూడో వికెట్‌కు 82 ప‌రుగులు జోడించిన త‌ర్వాత అభిషేక్ శ‌ర్మ వెనుదిరిగాడు. అప్ప‌టివ‌ర‌కు స్లోగా ఆడిన‌ అయ్య‌ర్ వేగం పెంచాడు. ఈ ద‌శ‌లో 38 బంతుల్లో అర్ధ‌సెంచ‌రీ సాధించాడు. అయితే స్కోరును పెంచే క్ర‌మంలో అయ్య‌ర్ ఔటైన‌ప్ప‌టికీ ఫినిష‌ర్ రోల్‌కు న్యాయం చేస్తూ శివ‌మ్ దూబే సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ‌డంతో టీమిండియా 180 ప‌రుగుల మార్క్‌ను దాటింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)