Breaking News

క్రికెట్‌ చరిత్రలో అసాధారణ రనౌట్‌

Published on Wed, 01/29/2025 - 19:03

క్రికెట్‌ చరిత్రలో ఓ విచిత్రమైన రనౌట్‌ నమోదైంది. సౌతాఫ్రికా అండర్‌-19 జట్టుతో జరుగుతున్న అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ అండర్‌-19 జట్టు ఆటగాడు ఆర్యన్‌ సావంత్‌ అసాధారణ రీతిలో రనౌటయ్యాడు. మ్యాచ్‌ 3వ రోజు సావంత్‌ 11 పరుగుల వద్ద బ్యాటింగ్‌ చేస్తూ జేసన్‌ రౌల్స్‌ వేసిన బంతిని స్లాగ్-స్వీప్ చేశాడు. 

అయితే బంతి షార్ట్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న జోరిచ్ వాన్ షాల్క్‌విక్‌ హెల్మెట్‌ను బలంగా తాకి, స్టంప్స్‌పైకి తిరిగి వచ్చింది. ఆ సమయంలో సావంత్‌ క్రీజ్‌ బయట ఉన్నాడు. సెకెన్ల వ్యవధిలో జరిగిపోయిన ఈ తంతు చూసి కొందరు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు రనౌట్‌కు అప్పీల్‌ చేయగా.. మరికొందరు బంతి హెల్మెట్‌కు తాకి గాయపడిన జోరిచ్‌ను పరామర్శించే పనిలో పడ్డారు. 

దక్షిణాఫ్రికా ఫీల్డర్ల అప్పీల్‌తో ఔటయ్యానన్న విషయాన్ని గ్రహించిన సావంత్‌ మెల్లగా పెవిలియన్‌ బాట పట్టగా.. బంతి బలంగా తాకడంతో జోరిచ్‌ మైదానంలో అపస్మారక స్థితిలో పడిపోయాడు. గాయపడిన జోరిచ్‌ను హుటాహుటిన అసుపత్రికి తరలించారు. జోరిచ్‌కు ఎలాంటి అపాయం కలగలేదని తదనంతరం దక్షిణాఫ్రికా మేనేజ్‌మెంట్‌ వెల్లడించింది. సావంత్‌ అసాధారణ రీతిలో రనౌటైన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.

కాగా, ఈ మ్యాచ్‌లో సావంత్‌ ఔటయ్యే సమయానికి ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ను కొనసాగించిన ఇం​గ్లండ్‌, మూడో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌తో పోలిస్తే  20 పరుగులు వెనుకపడ్డ ఇంగ్లండ్‌ ప్రస్తుతం 255 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో థామస్‌ ర్యూ (71) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

అంతకుముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 299 పరుగులకు ఆలౌటైంది. ఫర్హాన్‌ అహ్మద్‌, జాక్‌ హోమ్‌ అర్ద సెంచరీలతో రాణించారు. బదులుగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులు చేసింది. సౌతాఫ్రికా తరఫున ముహమ్మద్‌ బుల్‌బులియా, జేసన్‌ రౌల్స్‌ అర్ద సెంచరీలు చేశారు. 

 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)