స్టేడియం పైకప్పు బద్దలు కొట్టిన పంత్‌.. వైరల్‌ వీడియో

Published on Tue, 06/10/2025 - 12:46

ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం భారత సీనియర్‌ క్రికెట్‌ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌ జూన్‌ 20న లీడ్స్‌లోని హెడింగ్లేలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌ జూన్‌ 13 నుంచి 16 వరకు కెంట్‌ కౌంటీ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఇంట్రా స్క్వాడ్‌ మ్యాచ్‌ ఆడనుంది. 

ప్రతిష్టాత్మకమైన ఈ సిరీస్‌ కోసం భారత్‌ రెండు వారాల ముందే ఇంగ్లండ్‌లో వాలిపోయింది. ప్రస్తుతం టీమిండియా లార్డ్స్‌ క్రికెట్‌ మైదానంలో కఠోరమైన సాధన చేస్తుంది.

ఇందులో భాగంగా తాజాగా జరిగిన ఓ ప్రాక్టీస్‌ సెషన్‌లో టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ ఓ భారీ సిక్సర్‌ బాది వార్తల్లోకెక్కాడు. వాషింగ్టన్‌ సుందర్‌ బౌలింగ్‌లో పంత్‌ కొట్టిన ఓ సిక్సర్‌ స్టేడియం పైకప్పును బద్లలు కొట్టింది. దీనికి సంబంధిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను చూసి పంత్‌ అభిమానులు సంబరపడిపోతున్నారు. తమ ఫేవరెట్‌ ఆటగాడు తిరిగి లయను అందుకున్నాడని ముచ్చటపడిపోతున్నారు.

పంత్‌ను ప్రస్తుత ఇంగ్లండ్‌ సిరీస్‌ కోసం టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ సిరీస్‌లో అతను తొలిసారి భారత టెస్ట్‌ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన శుభ్‌మన్‌ గిల్‌కు డిప్యూటీగా వ్యవహరిస్తాడు. పంత్‌కు ఇంగ్లండ్‌లో మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. ఇక్కడ అతను 17 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్‌ సెంచరీల సాయంతో 32.70 సగటున 556 పరుగులు చేశాడు. పంత్‌ ఇంగ్లండ్‌ గడ్డపై చివరి సారి ఆడిన టెస్ట్‌ మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. 2022 పర్యటనలో అతను 111 బంతుల్లో 146 పరుగులు చేశాడు.

పేలవ ఫామ్‌ కొనసాగినా..!
పంత్‌ తాజాగా ముగిసిన ఐపీఎల్‌ సీజన్‌లో పేలవ ప్రద్శనలు చేశాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 269 పరుగులు మాత్రమే చేశాడు. సీజన్‌ ఆధ్యాంతం పేలవ ఫామ్‌లో కొనసాగిన పంత్‌.. తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. ఆర్సీబీతో జరిగిన ఆ మ్యాచ్‌లో పంత్‌ విధ్వంసకర శతకంతో (61 బంతుల్లో 118 నాటౌట్‌) విరుచుకుపడ్డాడు. అయినా ఆ మ్యాచ్‌లో పంత్‌ జట్టు ఎల్‌ఎస్‌జీ ఓటమిపాలైంది. 

జితేశ్‌ శర్మ ఊహకందని మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి ఆర్సీబీని గెలిపించాడు. ఈ సీజన్‌కు ముందు ఎల్‌ఎస్‌జీ పంత్‌ను రికార్డు ధర రూ. 27 కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్‌ చరిత్ర సృష్టించాడు. ఇంత డబ్బుపోసి కొనుక్కునా ఈ సీజన్‌లో పంత్‌ దారుణంగా నిరాశపరిచాడు. కెప్టెన్‌గా, ఆటగాడిగా తేలిపోయాడు. సీజన్‌ ఆరంభంలో టైటిల్‌ ఫేవరెట్‌గా కనిపించిన లక్నో చివరి వచ్చే సరికి ఏడో స్థానంతో సీజన్‌ను ముగించింది. ఇంగ్లండ్‌ పర్యటనలోనైనా పంత్‌ స్థాయికి తగ్గట్టు రాణించాలని కోరుకుందాం. 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)