Breaking News

ఇంగ్లండ్ జ‌ట్టుకు భారీ షాక్‌..

Published on Wed, 08/06/2025 - 21:01

ఇంగ్లండ్ ఫాస్ట్ బౌల‌ర్ బ్రైడాన్ కార్స్ ది హాండ్రెడ్ లీగ్‌-2025 నుంచి గాయం కార‌ణంగా వైదొలిగాడు.  ఈ ఏడాది సీజ‌న్‌లో కార్స్ నార్తర్న్ సూపర్‌చార్జర్స్ ప్రాతినిథ్యం వ‌హించాల్సి ఉండేది. కానీ అత‌డు ప్ర‌స్తుతం పాదం, బొట‌న‌వేలు గాయంతో బాధ‌ప‌డుతున్నాడు.

కార్స్ ఇటీవ‌ల భార‌త్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో భాగ‌మ‌య్యాడు. బంతితో పాటు బ్యాట్‌తో కూడా ఈ స్పీడ్ స్టార్ రాణించాడు. అయితే గాయం కార‌ణంగా కీల‌క‌మైన ఆఖ‌రి టెస్టుకు అత‌డు దూర‌మ‌య్యాడు. ఇప్పుడు వైద్య‌ల స‌ల‌హా మెరకు హాండ్రెడ్ లీగ్ నుంచి కూడా త‌ప్పుకొన్నాడు. ఈ విష‌యాన్ని కార్స్ ధ్రువీక‌రించాడు.

"భార‌త్‌తో జ‌రిగిన సుదీర్ఘ టెస్టు సిరీస్ అనంత‌రం వైద్య సిబ్బందితో నా గాయం గురించి సంప్రదింపులు జ‌రిపాను. వైద్యుల సూచ‌న మేర‌కు ఈ ఏడాది ది హండ్రెడ్‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణయించుకున్నాను. ఈ టోర్నీకి నేను దూరంగా ఉన్న‌ప్ప‌టికి నార్తర్న్ సూపర్‌చార్జర్స్ మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేయాల‌ని కోరుకుంటున్నాను.

భవిష్యత్తులో ఈ జట్టుకు మళ్లీ ప్రాతినిధ్యం వహించడానికి ఎదురు చూస్తున్నాను" అని ఓ ప్ర‌క‌ట‌న‌లో కార్స్ పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్ జ‌ట్టు స్వ‌దేశంలో సెప్టెంబ‌ర్‌లో ద‌క్షిణాఫ్రికాతో వైట్‌బాల్ సిరీస్‌లు ఆడ‌నుంది. ఈ సిరీస్‌ల‌కు కూడా కార్స్ దూర‌మ‌య్యే అవ‌కాశ‌ముంది. అత‌డు తిరిగి మ‌ళ్లీ యాషెస్ సిరీస్‌లో ఆడే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. 
చదవండి: కరుణ్ నాయర్ కంటే సుదర్శన్ బెటరా? ఇద్దరికి ఎన్ని మార్కులంటే?

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)