Breaking News

స్లో ఓవర్‌రేట్‌ దెబ్బ.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌!

Published on Mon, 06/22/2026 - 13:36

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో ఓటమి పాలైన ఇంగ్లండ్‌కు మరో గట్టి షాక్ తగిలింది. కివీస్‌తో రెండో టెస్టులో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు ఐసీసీ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించడంతో పాటు ఇంగ్లండ్‌ డబ్ల్యూటీసీ పాయింట్లలో 12 పాయింట్లు కోత విధించింది. ఈ నిర్ణయంతో ఇంగ్లండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈసారి ఐసీసీ వరల్డ్‌టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడాలన్న ఇంగ్లండ్ క‌ల నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు. 

ప్రస్తుతం డబ్ల్యూటీసీ పట్టికలో ఏడో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ పాయింట్స్ పర్సంటేజీ మాత్రం 34.72  నుంచి 26.38కి పడిపోయింది. ఇంగ్లండ్ 12 టెస్టులాడి 4 విజ‌యాలు, ఏడు ఓట‌ములు, ఒక డ్రాతో ఏడో స్థానంలో ఉంది. ఇక టీమిండియా 9 టెస్టులు ఆడి 4 విజ‌యాలు, 4 ఓట‌ములు, ఒక డ్రాతో ఆరో స్థానంలో కొన‌సాగుతుంది. 

2027లో జ‌ర‌గ‌నున్న ఐసీసీ వ‌ర‌ల్డ్‌టెస్టు చాంపియ‌న్‌షిప్ పైన‌ల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా త‌ల‌ప‌డే అవ‌కాశాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఏడు విజ‌యాలు, ఒక ఓట‌మితో ప‌ట్టిక‌లో తొలి స్థానంలో కొన‌సాగుతుండ‌గా, సౌతాఫ్రికా 4 టెస్టుల్లో 3 విజ‌యాలు, ఒక ఓట‌మితో రెండో స్థానంలో ఉంది.

ఇంగ్లండ్‌, న్యూజిలాండ్ రెండో టెస్టు విష‌యానికొస్తే.. ఓవ‌ల్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో కివీస్ 253 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యం సాధించింది. 463 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్ మాట్ హెన్రీ ధాటికి 209 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. మాట్ హెన్రీ ఆరు వికెట్ల‌తో ఇంగ్లండ్ ప‌తనాన్ని శాసించాడు. 

చెరో విజ‌యంతో ఇరుజ‌ట్లు 1-1తో స‌మానంగా ఉన్నాయి. నిర్ణ‌యాత్మ‌క మూడో టెస్టు ట్రెంట్‌బ్రిడ్జి వేదిక‌గా జూన్ 25 నుంచి మొద‌లుకానుంది. నైట్‌క్ల‌బ్ వివాదంతో రెండో టెస్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ స్టోక్స్‌, గ‌స్ అట్కిన్స‌న్‌లు మూడో టెస్టుకు జ‌ట్టుతో చేర‌నున్నారు.

Read: 90 నిమిషాలు అడ్డుగోడలా.. రోమాలు నిక్కబొడిచే ప్రదర్శన!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)