Breaking News

ENG VS IND 5th Test Day 4: నిలిచిపోయిన ఆట

Published on Sun, 08/03/2025 - 22:24

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఓవల్‌ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్‌ మ్యాచ్‌ హోరాహోరీగా సాగుతోంది. ఇంగ్లండ్‌ గెలుపునకు 35 పరుగుల దూరంలో ఉన్నప్పుడు వెలుతురులేమి వల్ల మ్యాచ్‌ నిలిచిపోయింది. ఆతర్వాత  భారీ వర్షం మొదలైంది. దీంతో మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పేశారు. ఆటగాళ్లంతా డ్రెస్సింగ్‌ రూమ్‌ల్లో సేద తీరుతున్నారు.

ఆట నిలిచిపోయే సమయానికి ఇంగ్లండ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. క్రాలే (14), డకెట్‌ (54), ఓలీ పోప్‌ (27), బ్రూక్‌ (111), జో రూట్‌ (105), జేకబ్‌ బేతెల్‌ (5() ఔట్‌ కాగా.. జేమీ స్మిత్‌ (2), జేమీ ఓవర్టన్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలుపుకు 35 పరుగులు, భారత గెలుపుకు 4 వికెట్లు కావాలి.

అంతకుముందు భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటై, ఇంగ్లండ్‌కు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. యశస్వి జైస్వాల్‌ (118) సెంచరీతో కదంతొక్కగా.. ఆకాశ్‌దీప్‌ (66), రవీంద్ర జడేజా (53), వాషింగ్టన్‌ సుందర్‌ (53) అర్ద సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోష్‌ టంగ్‌ 5 వికెట్లు తీశాడు.

దీనికి ముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 247 పరుగులకు ఆలౌటైంది. జాక్‌ క్రాలే (64), హ్యారీ బ్రూక్‌ (53) అర్ద సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలో 4 వికెట్లు తీశారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో కరుణ్‌ నాయర్‌ (57) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో అట్కిన్సన్‌ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్‌ సిరీస్‌లో భారత్‌ 1-2తో వెనుకపడి ఉంది.

 

 

 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)