Breaking News

లబుషేన్‌ ప్రపంచ రికార్డు.. వన్డే చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా

Published on Fri, 09/20/2024 - 13:26

ఆస్ట్రేలియా బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో వన్డేలో ఆల్‌రౌండ్‌ ప్రతిభతో అదరగొట్టిన అతడు.. ప్రపంచంలో ఇంతవరకు ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని అత్యంత అరుదైన ఘనత సాధించాడు. కాగా పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడేందుకు ఆసీస్‌ జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లింది.

హెడ్‌  విధ్వంసకర శతకం.. లబుషేన్‌ అజేయ హాఫ్‌ సెంచరీ
ఇందులో భాగంగా మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకున్న కంగారూ టీమ్‌.. గురువారం నుంచి ఐదు వన్డేల సిరీస్‌ మొదలుపెట్టింది. ఈ క్రమంలో నాటింగ్‌హామ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఏడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌ (129 బంతుల్లో 154 నాటౌట్‌) విధ్వంసకర శతకంతో ఆసీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మొత్తంగా 129 బంతులు ఎదుర్కొని 20 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ఇంగ్లండ్‌ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. అతడికి తోడుగా ఐదో నంబర్‌ బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌ సైతం రాణించాడు. 61 బంతుల్లో ఏడు ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 77 పరుగులతో అజేయంగా నిలిచి.. ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చడంలో హెడ్‌కు సహకరించాడు.

మూడు వికెట్లు తీసిన లబుషేన్‌
ఇక అంతకు ముందు..  టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య ఇంగ్లండ్‌ 49.4 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ స్పిన్నర్‌ ఆడం జంపా మూడు వికెట్లతో చెలరేగగా.. రైటార్మ్‌ లెగ్‌బ్రేక్‌ స్పిన్‌ బౌలింగ్‌ చేయగల లబుషేన్‌ సైతం మూడు వికెట్లు పడగొట్టాడు. ట్రవిస్‌ హెడ్‌ రెండు, డ్వార్షుయిస్‌, మాథ్యూ షార్ట్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

నాలుగు క్యాచ్‌లతో మెరిసిన లబుషేన్‌
ఇక ఈ మ్యాచ్‌లో బెన్‌ డకెట్‌ (91 బంతుల్లో 95; 11 ఫోర్లు), కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌(31 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రూపంలో కీలక వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టిన లబుషేన్‌.. జోఫ్రా ఆర్చర్‌(4) వికెట్‌ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు.. డకెట్‌, బ్రూక్‌, జాకబ్‌ బెతెల్‌ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ఆదిల్‌ రషీద్‌(0) క్యాచ్‌లు కూడా తానే అందుకున్నాడు.

 

వన్డే చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
అలా మూడు వికెట్లు పడగొట్టడంతో పాటు నాలుగు క్యాచ్‌లు అందుకుని.. లక్ష్య ఛేదనలో 77 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు లబుషేన్‌. తద్వారా ఈ కుడిచేతి వాటం ఆటగాడు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 

ఒక వన్డే మ్యాచ్‌లో అర్ధ శతకం బాదడంతో పాటు.. మూడు వికెట్లు తీసి.. మూడు కంటే ఎక్కువ క్యాచ్‌లు అందుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఇదీ 30 ఏళ్ల లబుషేన్‌ సాధించిన అత్యంత అరుదైన ఘనత!!.. ఇక ఇంగ్లండ్‌- ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే లీడ్స్‌ వేదికగా శనివారం జరుగనుంది. 

చదవండి: IND vs BAN: బుమ్రా సూపర్‌ బాల్‌.. బంగ్లా బ్యాటర్‌ ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)