‘అంతా ఫిక్సింగ్‌.. వాళ్లను గెలిపించడం కోసమే ఇదంతా’

Published on Mon, 07/13/2026 - 07:12

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో సెమీస్ బెర్తులు ఖ‌రారయ్యాయి. తొలి సెమీఫైన‌ల్లో ఫ్రాన్స్‌తో స్పెయిన్‌, రెండో సెమీస్‌లో అర్జెంటీనాతో ఇంగ్లండ్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈజిప్ట్  ఫార్వార్డ్ ప్లేయ‌ర్‌ మొస్తాఫా జీకో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఫిఫా టోర్నీ ముందే ఫిక్స్ అయింద‌ని, అర్జెంటీనాను గెలిపించ‌డం కోస‌మే టోర్నీ నిర్వ‌హిస్తున్నట్లుగా త‌న‌కు అనిపిస్తోంద‌ని పేర్కొన్నాడు. 

అర్జెంటీనాతో జ‌రిగిన ప్రిక్వార్ట‌ర్స్‌లో ఈజిప్ట్ 2-3 తేడాతో ఓట‌మి చ‌విచూసిన సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు సంబంధించి మెస్సీపై కూడా జీకో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. బహుశా మెస్సీ గొప్ప ఆటగాడే కావొచ్చు, కానీ తాను ప్రధానంగా పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో ​​రొనాల్డో నుంచి స్ఫూర్తి పొందుతానని పేర్కొన్నాడు.

ఇక ప్రిక్వార్టర్స్‌లో ఓటమి అనంతరం ఈజిప్ట్ జట్టు అర్జెంటీనాపై ఫిక్సింగ్ ఆరోపణలు చేసింది. మ్యాచ్ మొత్తం రిఫరీ అంపైరింగ్‌ను నిష్పక్షపాతంగా నిర్వహించలేదని, తమ జట్టుకు అన్యాయం జరిగిందని జీకో ఆరోపించాడు. తాము మెరుగైన ప్రదర్శన చేశామని, కానీ విజయం అనేది తమ చేతుల్లో లేదన్నాడు. టోర్నీ మొత్తం ముందే ఫిక్స్ అయిందని, రిఫరీ చేతుల మీదుగా ఫిక్సింగ్ నడుస్తోందని తెలిపాడు. అర్జెంటీనా కోసమే ఫిఫా నిర్వహిస్తున్నట్లు అందరికీ స్పష్టంగా అర్థమవుతోందని జీకో పేర్కొన్నాడు.

 

చదవండి: ‘మర్యాదగా మాట్లాడండి’.. మెస్సీ మాస్‌ వార్నింగ్‌!

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)