Breaking News

ఈసీబీ కీలక నిర్ణయం.. ఐర్లాండ్‌ క్రికెట్‌ బోర్డుపై నిషేధం?

Published on Wed, 08/05/2026 - 16:45

అప్గానిస్తాన్‌తో ఐదు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ నిర్వ‌హ‌ణ‌కు సిద్ధ‌మైన‌ ఐర్లాండ్ క్రికెట్ బోర్డుపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. అఫ్గాన్‌తో వ‌న్డే సిరీస్ ఆడ‌డం ఇంగ్లండ్‌కు ఇష్టం లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఆఫ్గ‌న్‌లో మహిళ‌ల ప‌ట్ల తాలిబ‌న్ల ప్ర‌వ‌ర్త‌న‌, లింగ వివ‌క్ష అని తెలుస్తోంది. 

2025 చాంపియ‌న్స్ ట్రోఫీలో అఫ్గానిస్తాన్‌తో ఇంగ్లండ్ త‌ల‌ప‌డిన‌ప్పుడు లండ‌న్‌లో వివిధ పార్టీల‌కు చెందిన 160 మంది ఎంపీల బృందం ఈసీబీని తీవ్రంగా విమ‌ర్శించింది. అప్ప‌టి నుంచి అఫ్గాన్‌తో క్రికెట్ ఆడేందుకు నిరాక‌రించిన ఇంగ్లండ్ కేవ‌లం ఐసీసీ మేజ‌ర్ టోర్నీల్లో మాత్ర‌మే మ్యాచ్‌లు ఆడుతోంది. 

తాజాగా త‌మ క‌నుస‌న్న‌ల్లో ఉండే ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఆఫ్గ‌న్‌తో సిరీస్ నిర్వ‌హ‌ణ‌కు సిద్ద‌మ‌వ్వ‌డం ఈసీబీకి కోపం తెప్పించింది. ఈ చ‌ర్య వ‌ల్ల ఇంగ్లండ్‌తో భ‌విష్య‌త్తులో ఆడాల్సిన అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌ను ఐర్లాండ్ కోల్పోయే ప్ర‌మాద‌ముందని చెప్పొచ్చు. గ‌తంలో స్వ‌దేశంలో యాషెస్ సిరీస్ ఆడ‌డానికి ముందు ఇంగ్లండ్ సన్నాహ‌కంగా ఐర్లాండ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడింది. 2019, 2023లో ఇది రిపీట్ అయింది. 

అయితే 2027 యాషెస్ సిరీస్‌కు ముందు మాత్రం ఈసారి ఐర్లాండ్‌తో కాకుండా బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడాల‌ని ఈసీబీ నిర్ణ‌యం తీసుకోవ‌డం చూస్తే ఐర్లాండ్ క్రికెట్ బోర్డుపై ఏర్ప‌డిన వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. ఇటీవ‌లి కాలంలో ఐర్లాండ్, అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డుతో (ఏసీబీ) స‌న్నిహిత సంబంధాల‌ను ఏర్ప‌ర‌చుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. గ‌త 10 సంవ‌త్స‌రాల్లో ఐర్లాండ్‌, ఆఫ్గ‌న్‌ల మ‌ధ్య ఇది ఐదో సిరీస్ కావ‌డం విశేషం.

అఫ్గానిస్తాన్‌తో వ‌న్డే సిరీస్ నిర్వ‌హించ‌డంపై ఐర్లాండ్ క్రికెట్ బోర్డు స్వ‌దేశంలో ప్ర‌జ‌ల నుంచి నిర‌స‌న‌లు ఎదుర్కొంటుంది. మ‌రోవైపు ఆస్ట్రేలియా కూడా అఫ్గానిస్తాన్‌తో వ‌న్డే సిరీస్ ఆడ‌డంపై ఐర్లాండ్ క్రికెట్ బోర్డుపై గుర్రుగానే ఉన్న‌ట్లు స‌మాచారం. క్రికెట్ బిగ్‌-త్రీ (బీసీసీఐ, ఈసీబీ, క్రికెట్ ఆస్ట్రేలియా)లో రెండు దేశాల క్రికెట్ బోర్డులు ఐర్లాండ్ క్రికెట్ బోర్డు తీరును వ్య‌తిరేకిస్తున్న వేళ అది క్ర‌మంగా ఏకాకిగా మిగిలిపోయే ప్ర‌మాదం లేక‌పోలేదు.

చదవండి: తొలి టెస్టులో చోటు కష్టమే.. అందుకేనా బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌!

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)

+5

IND Vs WI: హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియంలో టీ20 జోష్‌ (ఫొటోలు)