Breaking News

‘ఆస్ట్రేలియాలో కోహ్లి రెండు సెంచరీలు చేస్తాడు’

Published on Tue, 10/14/2025 - 18:22

వెస్టిండీస్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్‌ను 2-0తో వైట్‌వాష్‌ చేసిన టీమిండియా.. తదుపరి ఆస్ట్రేలియా (India Tour Of Australia 2025)లో పర్యటించనుంది. కంగారూ జట్టుతో భారత్‌ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. అక్టోబరు 19 నుంచి టీమిండియా ఆసీస్‌ టూర్‌ ప్రారంభం కానుండగా... దిగ్గజ బ్యాటర్లు విరాట్‌ కోహ్లి (Virat Kohli), రోహిత్‌ శర్మ (Rohit Sharma) చాన్నాళ్ల తర్వాత పునరాగమనం చేయనున్నారు.

అనూహ్యంగా టెస్టులకు రిటైర్మెంట్‌
చివరగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో టీమిండియాకు ఆడిన రో- కో.. ఆ తర్వాత అనూహ్యంగా టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించారు. ఇక గతేడాదే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు పలికిన ఈ ఇద్దరు మేటి బ్యాటర్లు.. వన్డేల్లో మాత్రం కొనసాగుతున్నారు.

ఆస్ట్రేలియాలో గిల్‌ సారథ్యంలో
ఇలాంటి తరుణంలో రోహిత్‌ శర్మ విషయంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించి.. అతడి స్థానంలో శుబ్‌మన్‌ గిల్‌కు పగ్గాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో గిల్‌ సారథ్యంలో మాజీ కెప్టెన్లు రోహిత్‌- కోహ్లి కలిసి ఆడనున్నారు.

కాగా రోహిత్‌పై వేటు వేసిన సమయంలో చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ మాట్లాడుతూ.. రోహిత్‌, కోహ్లి వన్డే వరల్డ్‌కప్‌-2027 ఆడటం గురించి తమకు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిపాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ రో-కో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మరో నాలుగైదేళ్లు ఢోకా లేదు
‘‘దయచేసి విరాట్‌ ఫిట్‌నెస్‌ గురించి ఎవరూ ఏమీ అడగకండి. ఫిట్‌నెస్‌ విషయంలో అతడొక గురు. అతడు ఏం చేసినా మిగతా వాళ్లు ఫాలో అయిపోతారు. కాబట్టి విరాట్‌ కోహ్లి ఫిట్‌నెస్‌ గురించి మనమేమీ ఆందోళన పడాల్సిన పనిలేదు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం అతడి కంటే ఫిట్‌గా ఉన్న మరొక ప్లేయర్‌ ఎవరూ లేరు. అయితే, కోహ్లి బ్యాట్‌చేతపట్టి ఎప్పుడెప్పుడు మైదానంలో దిగుతాడా అని నేను ఎదురుచూస్తున్నా.

చాలా రోజులుగా అభిమానులతో పాటు నేనూ అతడి ఆటను మిస్సవుతున్నాను. వన్డేల్లో కోహ్లి ఇంకా ఎంతో సాధించగలడు. ఇంకొన్నేళ్లు ఆడగల సత్తా అతడికి ఉంది. కనీసం మరో నాలుగైదేళ్లు కోహ్లి వన్డేలు ఆడతాడని నేను నమ్ముతున్నా.

కేవలం ఆడటమే కాదు.. తనదైన శైలిలో ఆధిపత్యం కూడా చూపిస్తాడని విశ్వసిస్తున్నా. ఆస్ట్రేలియాలో అతడి ఆట కోసం ఎదురుచూస్తున్నా. ఇక రోహిత్‌ విషయంలోనూ నేను ఇదే చెప్తా.

కోహ్లి రెండు సెంచరీలు చేస్తాడు
ఆస్ట్రేలియాలో ఈ ఇద్దరు దిగ్గజాలు భారీ స్కోర్లు సాధించి టీమిండియాను గెలిపిస్తారని ఆశిస్తున్నా. ఆస్ట్రేలియా కోహ్లికి ఇష్టమైన ప్రత్యర్థి. మూడు వన్డేల్లో కలిపి అతడు కనీసం రెండు శతకాలైనా బాదుతాడని అనుకుంటున్నా’’ అని భజ్జీ చెప్పుకొచ్చాడు. కాగా అక్టోబరు 19 నుంచి నవంబరు 8 వరకు ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య వన్డే, టీ20 సిరీస్‌లు జరుగనున్నాయి.

చదవండి: చరిత్ర సృష్టించిన ధ్రువ్‌ జురెల్‌.. భారత తొలి క్రికెటర్‌గా ఫీట్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)