Breaking News

ఫిఫా ప్రపంచకప్‌ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

Published on Wed, 06/10/2026 - 15:49

ప్రపంచవ్యాప్తంగా యమా క్రేజ్ ఉన్న ఫిఫా ప్రపంచకప్ ప్రారంభానికి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఫిఫా వరల్డ్‌కప్‌కు ఈసారి అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. 39 రోజుల పాటు జరగనున్న సాకర్ సమరంలో 48 దేశాలు పాల్గొన నున్నాయి. ఫైనల్ సహా మొత్తం 104 మ్యాచ్‌లు జరగనున్నాయి. 

మ్యాచ్‌ల నిర్వహణ, ఆరంభ వేడుకలకే పెద్ద మొత్తంలో ఖర్చు చేసే ఫిఫా నిర్వాహకులు.. టోర్నీలో విజేతగా నిలిచే జట్టుతో పాటు రన్నరప్ సహా సెమీఫైనలిస్ట్‌లు, క్వారర్ ఫైనలిస్ట్‌లు, గ్రూప్ దశలో వెనుదిరిగే జట్లకు అందించే ప్రైజ్‌మనీ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 


2022 ఫిఫా ప్రపంచకప్‌ విజేత అర్జెంటీనా

అయితే 1998 వరకు ఫిఫా ప్రపంచకప్ ప్రైజ్‌మనీ సాధారణంగానే ఉండేది. అయితే 1998 ప్రపంచకప్ ముగిసిన తర్వాత ప్రైజ్‌మనీ విలువ భారీగా పెరిగిపోయింది. ప్రస్తుత ఫిఫా వరల్డ్‌కప్‌లో మొత్తం ప్రైజ్‌మనీ విలువ 655 మిలియన్‌ అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 6 వేల కోట్లకు పైమాటే). 2022 ఫిఫా ప్రపంచకప్‌తో పోలిస్తే ప్రైజ్‌మనీ విలువ దాదాపు 50శాతం పెరగడం విశేషం. 

ప్రపంచంలోనే అతిపెద్ద టోర్నీగా పిలవబడే ఈవెంట్ అయిన ఫిఫా ప్రపంచకప్‌తో క్రికెట్‌లో నిర్వహించే టీ20 ప్రపంచకప్‌తో పోల్చలేమని క్రీడా పండితులు పేర్కొన్నారు. ఫిఫా ప్రపంచకప్ ప్రైజ్‌మనీలో టీ20 ప్రపంచకప్ ప్రైజ్‌మనీ సగం కూడా తూగదు. ఎందుకంటే ఫిఫా ప్రపంచకప్‌లో లీగ్ దశలో 17 నుంచి 32 స్థానాల్లో నిలిచే జట్లకు అందించే 11 మిలియన్ డాలర్లే ఐసీసీ టీ20 ప్రపంచకప్ మొత్తం ప్రైజ్‌మనీ విలువ కావడం గమనార్హం. 


2026 టీ20 ప్రపంచకప్‌ విజేత భారత్‌

అందుకే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ విలువను ఫిఫా ప్రపంచకప్‌ విలువతో పోలిస్తే దాని కాలిగోటికి కూడా సరిపోదు. ఇక ఫిఫా ప్రపంచకప్ ప్రైజ్‌మనీ అయిన 655 మిలియన్ అమెరికా డాలర్లను టోర్నీలో చాంపియన్స్‌గా నిలిచే జట్టు నుంచి లీగ్‌లో ఆఖరి స్థానంలో నిలిచే జట్లకు ఎలా పంచుతారనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఫిఫా ప్రపంచకప్ మొత్తం ప్రైజ్‌మనీ: 655 మిలియన్ డాలర్లు
చాంపియన్స్‌: 50 మిలియన్‌ డాలర్లు
రన్నరప్‌: 33 మిలియన్‌ డాలర్లు
మూడు, నాలుగు స్థానాలు: 27 మిలియన్‌ డాలర్లు
5 నుంచి 8వ స్థానం : 19 మిలియన్‌ డాలర్లు
9 నుంచి 16వ స్థానం: 15 మిలియన్‌ డాలర్లు
17 నుంచి 32వ స్థానం: 11 మిలియన్‌ డాలర్లు 
33 నుంచి 48వ స్థానం: 9 మిలియన్‌ డాలర్లు. దీనికి అదనంగా అర్హత సాధించిన ప్రతీ జట్టుకు సన్నాహక ఖర్చుల కింద మరో 1.5 మిలియన్‌ డాలర్లు అదనంగా లభిస్తాయి.

 

మరోవైపు ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2026 మొత్తం ప్రైజ్‌మనీ విలువ 11.25 మిలియన్‌ డాలర్లు.
చాంపియన్స్‌ (భారత్‌): 2.6 మిలియన్‌ డాలర్లు
రన్నరప్‌ (న్యూజిలాండ్‌): 1.42 మిలియన్‌ డాలర్లు
మూడో స్థానం (దక్షిణాఫ్రికా): 1 మిలియన్‌ డాలర్లు
నాలుగో స్థానం (ఇంగ్లండ్‌):  974,423 డాలర్లు
5 నుంచి 8వ స్థానం వరకు
వెస్టిండీస్ - 538,269 డాలర్లు
పాకిస్తాన్ - 522,692 డాలర్లు
జింబాబ్వే -  491,538 డాలర్లు
శ్రీలంక - 475,962 డాలర్లు

చదవండి: చతికిలపడ్డ బాలీవుడ్‌ స్టార్లు.. ఇది సార్ కోహ్లీ బ్రాండ్!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)