Breaking News

అభిమానులకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగానే ఆసియాకప్ మ్యాచ్‌లు చూడొచ్చు!

Published on Tue, 08/22/2023 - 09:54

క్రికెట్‌ అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తన్న ఆసియాకప్‌-2023కు సమయం దగ్గరపడుతోంది. ఆగస్టు 30న ముల్తాన్‌ వేదికగా పాకిస్తాన్‌, నేపాల్‌ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఇక ఈ టోర్నీ కోసం 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది.

కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ రీ ఎంట్రీ ఇవ్వగా.. ​యువ సంచలనం తిలక్‌ వర్మకు తొలిసారి వన్డే జట్టులో చోటుదక్కింది. ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది.

క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌..
ఆసియాకప్‌ మ్యాచ్‌లను డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌ ఫ్రీగా లైవ్‌స్ట్రీమింగ్‌ ఇవ్వనుంది. అభిమానులు మ్యాచ్‌లను తమ మొబైల్‌లో ఉచితంగా చూసుకోవ‌చ్చు. అయితే ఫ్రీ ఉచిత స్ట్రీమింగ్‌ను హైలైట్ చేస్తూ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌ ఓ వీడియోను రీలీజ్‌ చేసింది. భారత్‌లో మొబైల్ వాడ‌కందారుల‌కు త‌మ ఫ్లాట్‌ఫామ్‌ను మరింత చేరువ చేయడమే హాట్‌స్టార్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఎక్కడిగా వెళ్లినా క్రికెట్‌ను ఎటువంటి అవాంతరాలు లేకుండా చూడవచ్చని అర్ధం వచ్చేలా హాట్‌స్టార్‌ ఈ వీడియోను రూపొందించింది.

ఆసియా కప్ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసీద్ధ్ కృష్ణ.
చదవండి: CSK To Release Ben Stokes: చెన్నై సూపర్‌ కింగ్స్‌ కీలక నిర్ణయం.. 16 కోట్ల ఆటగాడికి గుడ్‌బై

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)